author image

Trinath

School holidays: పిల్లలకు సెప్టెంబర్‌లో పండుగే పండుగా.. ఎన్ని రోజులు సెలవులంటే?
ByTrinath

ఈ సెప్టెంబర్‌లో విద్యార్థులకు మొత్తం ఏడు రోజులు సెలవులు వచ్చాయి. నాలుగు ఆదివారాలతో పాటు సెప్టెంబర్‌ 6న జన్మాష్టమి, సెప్టెంబర్ 18న వినాయక చతుర్థి, సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్-నబీ / ఈద్-ఎ-మిలాద్ వచ్చాయి. మరోవైపు ఢిల్లీలో పిల్లలకు మరో మూడు రోజుల సెలవులు అదనం.. జీ20 సమావేశాల కారణంగా సెప్టెంబర్‌ 8,9,10 తేదీల్లో దేశరాజధానిలో స్కూల్స్‌కి హాలీడే ప్రకటించారు..

Gangavaram port: గంగవరం పోర్టు కార్మికులతో చర్చలు సఫలం.. వీధిలోకి వెళ్లడానికి అంగీకరించిన కార్మికులు!
ByTrinath

గంగవరం పోర్టు కార్మికులతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. సమ్మె కాలంలోని 21 రోజుల వేతనం చెల్లించడానికి పోర్ట్ యాజమాన్యం అంగీకరించింది. గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వ చర్చలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఏటా ఇచ్చే ఎంక్రిమెంట్‌తో పాటు అదనంగా 1,500 రూపాయలు అదనంగా ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు.

Chalo Vijayawada: ఐడి కార్డులు చూపించాలి.. ఛలో విజయవాడకు హైకోర్టు ఓకే.. కండీషన్స్‌ అప్లై!
ByTrinath

కొన్ని షరతులతో 'ఛలో విజయవాడ'కు హైకోర్టు అనుమతించింది. 500 మందితో పరిమితమైన ఆంక్షలతో ధర్నా చౌక్‌లో ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. వారం రోజుల ముందు ధర్నాలో పాల్గొనే ఉద్యోగులు ఆధార్ కార్డులు పోలీసులకు అందించాలని హైకోర్టు చెప్పింది.

Parliament's special session: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్.. బిల్లుకు ముహూర్తం ఫిక్స్!
ByTrinath

‘ఒక దేశం, ఒకే ఎన్నికలు(One Nation One election)’ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. సెప్టెంబర్‌ 18 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్లాన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఐడియా కింద, లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే టైమ్‌లో ఎన్నికలు జరుగుతాయి.

'INDIA' Meet: టార్గెట్‌ అదానీ..! మోదీతో ఆయనకు లింకేంటి: రాహుల్ సూటి ప్రశ్న
ByTrinath

మోదీకి అదానీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. పారిశ్రామికవేత్త అదానీ ఓ తీవ్ర విమర్శలు చేశారు.. I.N.D.I.A కూటమి సమావేశానికి ముందు రాహుల్ గాంధీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి అదానీ గ్రూప్‌పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

Jawan Trailer: జవాన్‌లో ఆ డైలాగ్‌ సమీర్‌ వాంఖడే గురించేనా? పోలీసోడికి షారుఖ్‌ ఇచ్చిపడేసిండుగా!
ByTrinath

మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) చీఫ్‌ సమీర్‌ వాంఖడే-బాలీవుడ్‌ బాద్‌షా ఆర్యన్‌ ఖాన్‌ ఎపిసోడ్‌ మరిచిపోయేది కాదు. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ని కస్టడీలోకి తీసుకొని సమీర్‌ వాంఖడే దర్యాప్తు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అదే సమయంలో షారుఖ్‌ 'జవాన్‌' సినిమా షూటింగ్‌ జరుగుతుండగా..తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌లో సమీర్‌ని హెచ్చరిస్తూ బాలీవుడ్‌ బాద్‌షా డైలాగులు పేల్చినట్టు ఫ్యాన్స్‌ చెబుతున్నారు.

Loksabha elections: అక్టోబర్‌లో లోక్‌సభ రద్దు? ముందస్తు ఎన్నికలు ఫిక్స్..?
ByTrinath

ఇండియా కూటమికి చెక్‌ పెట్టేలా బీజేపీ భారీ స్కెచ్‌ వేస్తున్నట్టు అర్థమవుతోంది. ముందస్తుపై ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అక్టోబర్‌లో లోక్‌సభ రద్దవుతుందని.. జనవరిలో ముదుస్తు ఎన్నికలు జరగుతాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

G20: పుతిన్‌ బాటలోనే జిన్‌పింగ్‌.. జీ20 సమావేశానికి మరో అగ్రనేత డుమ్మా!
ByTrinath

జీ20 శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టనున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా రావడం లేదని చెప్పిన విషయం తెలిసిందే. జిన్‌పింగ్‌కి బదులుగా 'లీ కియాంగ్' ఈ శిఖరాగ్ర సమావేశానికి బీజింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలుస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జీ20 మీటింగ్‌కు హాజరవుతున్నారు.

TTD: సీఎం చేతుల మీదుగా శ్రీనివాససేతు ప్రారంభోత్సవం.. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు!
ByTrinath

తిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు ఉంటాయని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18న సీఎం చేతుల మీదుగా తిరుపతిలో శ్రీనివాససేతు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు ధర్మారెడ్డి. ఇక సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 14 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయన్నారు. భక్తులు వేచి ఉండేందుకు వివిధ ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని.. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులు.. లిస్ట్ చూసుకోండి!
ByTrinath

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో 16 రోజులు బ్యాంక్‌లకు హాలీడేస్‌ ఉన్నాయి. అందులో ఆరు రోజులు వారంతపు సెలవులు ఉండగా.. మిగిలినవి పండుగలు, ఇతర జయంతిలు. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మహారాజా హరిసింగ్ జయంతి, ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీకి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

Advertisment
తాజా కథనాలు