author image

Trinath

Chitti Babu: వైసీపీ ఎమ్మెల్యేకు బ్రెయిన్‌ స్ట్రోక్.. ప్రస్తుతం అబ్జ్వరేషన్‌లో..!
ByTrinath

వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు...తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కుడికాలు లాగడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి "మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్" గా నిర్దారించడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో హుటాహుటిన హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. కొండేటి చిట్టిబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... పి.గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.Chitti Babu

Breaking: సీఎండీ ప్రభాకర్ రావు సంతకం ఫోర్జరీ.. ఆర్టీవీ చేతికి చెక్కిన నకిలీ అపాయింట్మెంట్ లెటర్
ByTrinath

జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేసిన ప్రవీణ్‌ గుట్టురట్టైంది. సీఎండీ ప్రభాకర్ రావు పేరిట కూడిన సంతకంతో విద్యుత్ సంస్థల్లో నియామక పత్రాల పేరిట లక్షల్లో వసూళ్లు చేశాడు ప్రవీణ్‌. విద్యుత్ సంస్థలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మిస్తున్నాడు. CMD Prabhakar rao

YSR Rythu Bharosa: ఇవాళ రైతుల ఖాతాల్లోకి డబ్బులు..  బ్యాంక్ అకౌంట్‌లోకి ఎంత జమ అవుతుందంటే?
ByTrinath

గత వారం జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ఏపీ వైసీపీ ప్రభుత్వం.. ఇవాళ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా(YSR Rythu Bharosa) నిధులను విడుదల చేస్తోంది. సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఖాతా బదిలీ ద్వారా సాయం అందుతుంది. మొదటి విడతగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు అందిస్తోంది ప్రభుత్వం.

Kushi: విజయ్-సమంత కెమిస్ట్రీ అదిరింది భయ్యా.. 'ఖుషి' ట్విట్టర్‌ రివ్యూ!
ByTrinath

విజయ్-సమంత నటించిన 'ఖుషి' సినిమా ట్విట్టర్‌ రివ్యూ అదిరింది. విజయ్-సమంత కెమిస్ట్రీ స్క్రీన్‌పై అదిరిందని.. ఫీల్ గుడ్ మూవీ చూశామన్న భావన కలుగుతుందని ఫ్యాన్స్‌ ట్వీట్లు పెడుతున్నారు. అటు సాంగ్స్‌ కూడా స్క్రీన్‌పై చాలా బాగున్నాయంటున్నారు అభిమానులు. మరికొందరు మాత్రం స్టోరీ స్లో నేరషన్‌లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాలు అందించిన శివ నిర్వాణ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. Kushi Movie Twitter review

SHARMILA VS TUMMALA: పాలేరు వార్.. షర్మిల, తుమ్మలలో ఈ సీటు ఎవరికి దక్కనుంది?
ByTrinath

తెలంగాణ రాజకీయాల్లో డైనమిక్స్ మారుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాలేరు టికెట్‌ కావాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్‌ కూడా అంగీకరించిందని సమాచారం..మరోవైపు పాలేరు నుంచి పోటి చేస్తానని ఇప్పటికే వైటీపీ అధినేత్రి షర్మిల ప్రకటించగా.. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు రెడీ ఐనట్టు ప్రచారం జరుగుతోంది. SHARMILA VS TUMMALA

Big News: చంద్రుడిపై ప్రకంపనలు..అచ్చం భూకంపం లాగానే.. గుర్తించిన చంద్రయాన్-3!
ByTrinath

జాబిల్లి ఉపరితలంపై ప్రయోగాలు చేస్తున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. జాబిల్లిపై ప్రకంపనలను ఇస్రో పరిశోధనలు గుర్తించాయి. ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు ఇతర పేలోడ్‌ల ఆధారంగా జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ఇస్రో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ ఈ ప్రకంపనలు రికార్డ్ చేసింది.Quake on Moon

Jobs: 1,303 రైల్వే జాబ్స్‌కి ముగుస్తున్న గడువు.. త్వరపడండి..!
ByTrinath

1,303 రైల్వే జాబ్స్‌కి సెప్టెంబర్‌ 2తో గడువు ముగియనుంది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టులకు సెంట్రల్ రైల్వే రిక్రూట్‌ చేసుకుంటోంది. దరఖాస్తుదారుల వయసు కేటగిరీ వారీగా.. జనరల్ అభ్యర్థులు 42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు తప్పనిసరిగా 2021 ఆగస్టు 1 లేదా అంతకు ముందు రైల్వేలో పని చేస్తూ ఉండాలి. RRC Recruitment 2023

Modi meets Praggnanandhaa: నీ పట్టుదలకు ఫిదా బాసూ.. మోదీని కలిసిన ప్రజ్ఞానంద..!
ByTrinath

ప్రధాని మోదీని కలిశారు చెస్ ప్రాడిజీ ప్రజ్ఞానంద. మోదీ నివాసంలో ప్రజ్ఞానంద, అతని కుటుంబసభ్యులు మోదీని కలిశారు. ఇటివలి FIDE టోర్నమెంట్‌లో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్న ప్రజ్ఞానంద ఆ పతకాన్ని మోదీకి చూపించాడు. ఇక ఇప్పటికే ప్రజ్ఞానందకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రూ.30 లక్షల చెక్కును అందించి మెమెంటోను బహుకరించారు.

వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ  పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌ను రద్దు..!
ByTrinath

రాజమహేంద్రవరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్‌లో 24 సీట్లుండగా 40 జనరల్ మెడిసిన్ సీట్లను భర్తి చేసినట్లు గుర్తించింది నేషనల్ మెడికల్ కమిషన్ . మెడికల్ కళాశాలలు సీట్ల భర్తీలో అవకతవకల కారణంగా వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌ను రద్దు చేశారు. రెండు రోజుల్లో కొత్త సీట్ మెట్రిక్స్ తయారుచేసి సీట్ల భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు