ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని దక్షిణ కోస్తాలో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయి.
Trinath
ByTrinath
తెలంగాణలో కాంగ్రెస్ బాటలోనే బీజేపీ అడుగులేస్తోంది. అసెంబ్లీ సీటు ఆశిస్తున్న వారిని అప్లై చేసుకోవాలని కోరుతోంది. ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ఈ నెల 10వరకు కొనసాగనుంది. ఈ నెలాఖరులోపు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ జాబితాను జాతీయ నాయకత్వం పరిశీలించి, అభ్యర్థులను ఖరారు చేసి వారి పేర్లను ప్రకటిస్తుందని సమాచారం.
ByTrinath
ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ(సెప్టెంబర్ 4) భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవ్వనుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణలతో ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు సమాచారం. అతని స్థానంలో ఈ మ్యాచ్‌లో షమీ బరిలోకి దిగనున్నాడు.
ByTrinath
స్లీప్ ఎంగ్జైటీ అన్నది చాలా పెద్ద సమస్య. అనుభవించినవాడికే ఈ సమస్య అర్థమవుతుంది. దీని వల్ల ఏకాగ్రతలో ఇబ్బంది కలుగుతుంది. ఆందోళన పెరుగుతోంది.. జీర్ణశయాంతర సమస్యలు వస్తాయి. బెడ్ టైమ్‌కి ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం.. పడుకునే ముందు ఓవర్‌గా భోజనం చేయకుండా ఉండడం లాంటివి చిట్కాలుగా పాటించండి.
ByTrinath
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 4తో ముగియనుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్), 66 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్), 19 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా)తో పాటు ఇతర పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత ఉండి.. అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి.
ByTrinath
ఆసియా కప్‌లో భాగంగా పల్లెకెలే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. పాండ్యా, ఇషాన్ కిషన్ సూపర్ ఆటతో టీమిండియా ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఏదో చేస్తారని ఆశించిన రోహిత్, కోహ్లీ తీవ్రంగా నిరాశ పరిచారు. అటు పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిది నాలుగు వికెట్లతో నిప్పులు చెరిగాడు.
ByTrinath
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా 'వ్యూహం' నుంచి సాంగ్ విడుదల చేశారు మూవీ మేకర్స్. 'మా నాన్న వెంట కానీ.. వాళ్ల నాన్న వెంట కానీ ఇంతమంది జనం రావడం నేను చూడలేదు' అని చంద్రబాబు భార్య ఆయనతో అనడం.. దానికి బదులుగా 'జనానికి పిచ్చి ముదిరింది' అని చంద్రబాబు అనడం లాంటి డైలాగులు పాటలో వినిపించాయి.'నరకాసుర నవ్వులు.. రాబంధుల హేళనలు' అంటూ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి.
ByTrinath
నిజాయితీ లేని వ్యక్తిగా ప్రపంచం మిమ్మల్ని గుర్తించేలాగా చేసుకోవద్దు. అబద్ధాలు అందరూ చెబుతారు.. అయితే అవి ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. అబద్ధాలు తరుచుగా చెప్పే వ్యక్తితో లిమిట్‌లో ఉండండి. కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. పదేపదే అబద్ధాలు చెప్పే వ్యక్తిని "పాథలాజికల్ అబద్ధాలకోరు(pathological liar)" అని పిలుస్తారు.
ByTrinath
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, నిద్ర లేదా ఆహారపు అలవాట్లను పదేపదే మార్చుకోవడం మానసిక సమస్యలను పెంచుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, ప్రియమైన వ్యక్తి మరణం లేదా విడాకులు లాంటి ఒత్తిడితో కూడిన జీవిత పరిస్థితులకు మెంటల్ హెల్త్ లేకుండా చేస్తాయి. ఇటివలి కాలంలో యువకుల్లో మానసిక సమస్యలు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rains--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bjp-flags-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/india-vs-nepal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sleep-disorder-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/aai-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ssc-jobs-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pandya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jagan-vyohham-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/liars-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mental-health-jpg.webp)