హైదరాబాద్‌లో వర్షం నాన్‌స్టాప్‌గా దంచికొడుతుండడంతో పలు స్కూల్స్ హాలీడే ప్రకటించాయి. స్కూల్‌కి ఇవాళ రావొద్దని తల్లిదండ్రులకు మెసేజీలు పెడుతున్నాయి. అటు జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం అత్యవసరం అయితే తప్ప బయటకు రావోద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Trinath
ByTrinath
హైదరాబాద్‌లో వాన దంచికొడుతోంది. ఈ కుంభవృష్టి ధాటికి నగరంలో రోడ్లన్ని జలమయమయ్యాయి. మియాపూర్‌లో 11.45 సెంటీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు అడుగు పెట్టవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు కామారెడ్డిలో అత్యధికంగా 104.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ByTrinath
సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఉదయనిధిపై తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా.. అటు 'INDIA' కూటమి కూడా డిఫెన్స్‌లో పడిపోయింది. ఉదయనిధి అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ కాంగ్రెస్, ఆప్ నేతలు సైతం స్టాలిన్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఇక సనాతన ధర్మం వల్ల బాధపడుతున్న బలహీన వర్గాలు, బడుగు వర్గాల ప్రజల తరుపున మాట్లాడానని.. అంతేకానీ మతం గురించి కాదంటున్నారు ఉదయ్‌నిధి స్టాలిన్.Udhayanidhi stalin vs BJP
ByTrinath
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే త్రినాను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు నీతా అంబానీ, లలిత్ మోదీ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. సాల్వేకి ఇది మూడో పెళ్లి. సాల్వే మరియు అతని మొదటి భార్య మీనాక్షి 38 సంవత్సరాల వివాహం తర్వాత జూన్ 2020లో విడాకులు తీసుకున్నారు. Harish Salve
ByTrinath
టీమిండియా స్టార్ క్రికెటర్ బుమ్రాకు కుమారుడు పట్టాడు. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు ఈ విషయన్ని చెప్పాడు. Jasprit Bumrah Sanjana Ganesan become parents
ByTrinath
వాయిస్ ఆఫ్ ఇస్రో, సైంటిస్ట్ వలర్మతి తుది శ్వాస విడిచారు. 1984 నుంచి ఇస్రోలో సైంటిస్టుగా ప్రాజెక్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న వలర్మతి గుండెపోటుతో మరణించారు. చంద్రయాన్-3 మిషన్‌కు ఏం చెప్పిన కౌంట్‌డౌన్ ఆమె కెరీర్‌లో చివరిది. దేశపు మొట్టమొదటి స్వదేశీ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమైన RISAT-1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా వలర్మతి పని చేశారు. ఆమె మరణం పట్ల సైంటిస్టులు, దేశ ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు.ISRO scientist N Valarmathi
ByTrinath
భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజరు కావడం పట్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. బైడెన్ ఒక్క రోజు ముందుగానే ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుండగా.. మోదీతో బైడెన్ ఈ నెల 8న భేటీ కానున్నారు. మరోవైపు జిన్‌పింగ్ డుమ్మా వెనుక అరుణాచల్ ప్రదేశ్ అంశం ముడిపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ByTrinath
మ్యాచ్ సమయంలో ప్రత్యర్థులతో ఫ్రెండ్లీగా ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఆసియా కప్‌లో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్‌లో భారత్- పాక్ ఆటగాళ్ల మధ్య జరిగిన సరదా క్షణాలపై గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండొచ్చని.. గేమ్ జరుగుతున్న సమయంలో సీరియస్‌నెస్ ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.
ByTrinath
తమిళనాడు తిరుప్పూర్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారు. కొడవళ్లతో దారుణంగా నరికి చంపిన దుండగులు. మృతులు షాపు ఓనర్ సెంథిల్‌కుమార్ కుటుంబంగా గుర్తించారు. ఈ హత్య వెనుక మాజీ ఉద్యోగి వెంకటేశన్ ఉన్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ByTrinath
వివాదాస్పదుడిగా పేరొందిన హైదరాబాద్ జీడిమెట్ల సీఐ వెంకట్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఐబీపీఎల్ చౌరస్తా వద్ద ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ని కాలితో తన్ని చెంప పగలగొట్టాడు. అతని చెవులు పిండాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెల మామూల కోసమే ఇలా చేశాడని మిగిలిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు ఆరోపిస్తుండగా.. సదరు డ్రైవర్ ర్యాష్‌గా బస్సు నడుపుతున్నాడని.. అడిగితే దురుసుగా సమాధానం చెప్పడంతోనే అలా చేయాల్సి వచ్చిందని వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/schools-holiday-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/hyd-kumbavrusti-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stalins-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/harish-and-lalit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bumrah-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/valamarthy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/biden-jinping-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gambhir-rauf-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tn-murdr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jeedimetla-ci-jpg.webp)