author image

Trinath

Rains in Andhra, Telangana: రెండు రోజులు బాదుడే బాదుడు.. తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పంజా
ByTrinath

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు ఇప్పటికే బీభత్సం సృష్టిస్తుండగా మొత్తంగా నలుగురు చనిపోయారు. తెలంగాణలో 5 జిల్లాలకు ఆరెంజ్‌, 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. Rain Alert in Telugu States

Asia Cup: సూపర్-4 వేదికల్లో మార్పుపై క్లారిటీ.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?
ByTrinath

ఆసియా కప్‌ మ్యాచ్‌ల వేదికలు మార్చకూడదని ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) నిర్ణయించుకుంది. సూపర్‌-4 మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ మ్యాచ్‌ కొలంబోలోనే జరుగుతుంది. కొలంబోలో వర్షాల కారణంగా మ్యాచ్‌లను హంబన్‌టోటాకు తరలించాలని ముందుగా అనుకున్నారు. అయితే కొలంబోలో వాతావరణ మెరుగయ్యే అవకాశాలు ఉండడంతో వేదిక మార్పు చేయడంలేదు. ఇక సెప్టెంబర్‌ 10న ఇండియా-పాకిస్థాన్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో తలపడనున్నాయి. Asia Cup 2023 Super 4 full schedule

Dravida vs Sanathana: ద్రవిడ, సనాతన మధ్య ఈ వైరం ఎందుకు? చరిత్ర ఏం చెబుతోంది?
ByTrinath

సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నాయి. మరోవైపు అసలు ఉదయనిధి స్టాలిన్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు, కుల వ్యవస్థను ఎందుకు నిర్మూలించాలంటున్నారన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వందల ఏళ్ల నాటి ద్రవిడ, బ్రహ్మణవాద వైరం గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు.

World cup: వరల్డ్ కప్‌కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..స్టార్‌ కీపర్‌కు నో ఛాన్స్!
ByTrinath

టీమిండియా ప్రపంచ కప్ జట్టు: శుభ్‌మన్ గిల్, రోహిత్(కెప్టెన్), విరాట్, అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్‌ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీరాజ్, మొహమ్మద్ షమీరాజ్ , కుల్దీప్ యాదవ్. World cup squad 2023

ISRO Scientist Salary: ఇస్రో సైంటిస్ట్ శాలరీ ఎంత? ప్రస్తుతం జాబ్‌ ఓపెనింగ్స్‌ ఎన్ని ఉన్నాయి?
ByTrinath

చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ విజయాల తర్వాత ఎక్కడ చూసినా ఇస్రో సైంటిస్టుల గురించే చర్చ జరుగుతోంది. ఇస్రో సైంటిస్టుల శాలరీ గురించి గూగుల్‌లో సేర్చ్‌ చేస్తున్నారు నెటిజన్లు. రిపోర్ట్స్ ప్రకారం ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్సీ) ప్రారంభ వేతనం రూ.84,360. ఇక బెనిఫిట్స్‌ కూడా అదనంగా ఉంటాయి. ప్రస్తుతం 65 సైంటిస్టు, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ISRO Scientist Salary

Hyderabad Traffic: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్.. నిలిచిపోయిన వాహనాలు!
ByTrinath

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ స్తంభించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా వరుణుడు దంచికొట్టడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మియాపూర్‌, మదాపూర్‌ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్, సరోజ్నీదేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్‌పై వాహనాల రాకపోకలు స్లోగా సాగుతున్నాయి.Hyderabad Traffic Alert

Rains in AP, Telangana: అల్పపీనడం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ByTrinath

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్‌పై వానదేవుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగులో కూరగాయల వ్యాపారి షేక్ మహ్మద్ ఖాసీం నీట మునిగి మృతి చెందాడు. Heavy rains in Telugu states

Rains: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం.. రెండు గంటలు దంచిపడేసింది!
ByTrinath

హైదరాబాద్‌ ఒక్కసారిగా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. వరుణుడు నాన్‌స్టాప్‌గా దంచికొడుతున్నాడు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్ పేట ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మియాపూర్‌, కుకట్‌పల్లిలో భారీగా వర్షపాతం నమోదైంది.

Teachers day 2023: అక్కడ టీచర్లకు నెలకు 5 లక్షల జీతం.. విద్యావ్యవస్థ కూడా అదుర్స్!
ByTrinath

టీచర్స్ డే(సెప్టెంబర్‌ 5) సందర్భంగా ప్రతిఒక్కరూ తమ గురువులను గుర్తు తెచ్చుకుంటున్నారు. స్కూల్‌, కాలేజీల్లో విద్యార్థులు నేరుగా విషెస్‌ చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలో ఏ దేశంలో టీచర్లకు అత్యధిక జీతాలు ఇస్తారోనని ఆసక్తి చూపిస్తున్నారు. లక్సెంబర్గ్‌లో సగటున నెలకు రూ.5లక్షల జీతాన్ని పొందుతున్నారు టీచర్లు.

Advertisment
తాజా కథనాలు