ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ రద్దు అయ్యింది. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును కలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరగగా.. కుటుంబసభ్యులు రాలేదు. అడ్వకేట్లకు తప్ప ఇతరులకు ములాఖత్ ఉండదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సెంట్రల్ జైలు చుట్టూ భద్రతను పటిష్టం చేశారు పోలీసులు. చంద్రబాబు నాయుడు కోసం మందులు, ఆహారం తీసుకువెళ్లేందుకు అనుమతించిన కొద్దిమంది తప్ప ఇతరులెవరినీ ప్రవేశ ద్వారాల దగ్గరికి అనుమతించలేదు.
Trinath
ByTrinath
మొరాకోలోని హైఅట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన శక్తివంతమైన భూకంపానికి దాదాపు 632 మంది చనిపోయారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన నగరాల నివాసితులు వారి ఇళ్ల నుంచి పరుగెత్తినట్లు అక్కడి మీడియా చెబుతోంది. గాయపడిన వారి సంఖ్య ఎంతన్నది ఇప్పటివరకు అధికారికంగా స్పష్టంగా కాలేదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన పాత నగరంలో కొన్ని భవనాలు కూలిపోయాయని భూకంప కేంద్రానికి సమీపంలోని పెద్ద నగరమైన మర్రకేచ్ నివాసితులు తెలిపారు.
ByTrinath
GST అక్రమాలు, విజిల్‌బ్లోయర్ నివేదికలు, షెల్ కంపెనీల్లోకి నిధులు, ఆర్థిక శాఖ ప్రమేయం, విధానపరమైన అక్రమాలు, నిధుల మళ్లింపు లాంటి విషయాలు సీఐడీ విచారణలో వెలుగుచూసినట్టుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా రచ్చ లేపింది. Chandrababu Skill Development Scam Case
ByTrinath
ప్రపంచంలోని అత్యంత ధనిక, అత్యంత శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం లభించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన కూటమి శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. African Union becomes permanent member of G20
ByTrinath
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు 2015లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 3 వేల 356 కోట్ల ఈ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి నంద్యాల పట్టణంలోని జ్ఞానపురం ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు. AP Skill Development Case
ByTrinath
మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల కనీసం 300 మంది మరణించినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంపం కారణంగా భవనాలకు భారీ నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ కోతలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు దేశంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా మొరాకో మీడియా పేర్కొంది. ఇక ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. Morocco Earthquake
ByTrinath
నాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నారు ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేనేమన్నా టెర్రరిస్టునా.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ByTrinath
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆయనకు మెడికల్ టెస్టులు చేశారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించారు. ఇది నాన్ బెయిలబుల్ నేరమని చెబుతూ బెయిల్‌పై విడుదల చేయలేమని నోటీసులో పేర్కొంది. మీరు కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ కోరవచ్చు' అని సీఐడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం ధనుంజయుడు నోటీసులో స్పష్టం చేశారు. chandrababu medical check up
ByTrinath
నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా ? ఆ సైకో చెప్పాడా నీకు ? పోలీసుల తీరుపై టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నంద్యాలలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేశ్‌ని అడ్డుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసుల హై డ్రామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు! Nara Lokesh
ByTrinath
నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో హైడ్రామా నెలకొంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత అరెస్ట్ అవ్వడంతో ఏపీలోని అన్ని జిల్లాలో టీడీపీ లీడర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఇటు నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. అటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. AP SKILL development scam
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mulakat-cancelled-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/moroccoo-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/skill-scam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/g20-summit-african-union-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/skill-development-scam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/morocooo-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chandrababu-terr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbn-arrest-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/lokesh-arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbn-arrest-jpg.webp)