ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అసలు బ్యాటింగ్ చేయడమే మరిచిపోయినట్టు ఆడారు. ఆడుతున్నది వన్డేనా, టెస్టా అన్న రీతిలో సాగిందీ పాక్ బ్యాటింగ్. ఏకంగా 228 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
Trinath
ByTrinath
మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇవాళ ఆసుపత్రిలో చేరారు డీఎస్. సుదీర్ఘకాలంలో క్రీయాశీల రాజకీయాల్లో డీఎస్ ఉన్నారు. గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు డీఎస్. కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు డీఎస్. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చినట్లు ట్వీట్ చేశారు ఎంపీ అర్వింద్. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు డీఎస్.
ByTrinath
గత ఆగస్టు 20న సిడ్నీలో జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో స్పెయిన్ 1-0తో ఇంగ్లండ్‌పై గెలుపొందిన తర్వాత అవార్డుల ప్రదానోత్సవంలో జెన్నీ హెర్మోసో పెదవులపై ముద్దుపెట్టుకున్న రూబియాల్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తన సమ్మతి లేకుండా ముద్దు పెట్టుకున్నట్లు హెర్మోసో తెలిపారు. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి విమర్శలు వచ్చాయి. యనపై సస్పెన్షన్ వేటు వేసింది ఫిఫా. అటు తన పదవికి రాజీనామా చేశారు లూయిస్.
ByTrinath
2021 కేసులో ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకోలేదు..? అరెస్ట్‌పై 3 రోజుల ముందే సమాచారం వచ్చినా ఎందుకు స్పందించలేదు.? ఇప్పుడివే ప్రశ్నలతో టీడీపీ లీగల్ సెల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పోలీసులు అర్ధరాత్రి వెళ్లి ఉదయం చంద్రబాబును అరెస్టు చేశారని.. మరి టీడీపీ లీగల్ సెల్ లంచ్ మోషన్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ByTrinath
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలకు హైఅలర్ట్ ప్రకటించారు. మత్య్సకారులకు హెచ్చరికలు జారీ చేశారు. 5 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది.
ByTrinath
ఇవాళ(సెప్టెంబర్ 11) ఉదయం నుంచి కస్టడీ విషయమై వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత.. నిశితంగా పరిశీలించి న్యాయమూర్తి వాదనలను రేపటికి వాయిదా వేశారు. కొన్ని అంశాలపై మరిన్ని వివరాలు అడగగా..వాటికి వివరణ ఇచ్చారు చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా. వివరణ తర్వాత పది నిమిషాలు జడ్జి బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత తిరిగి వచ్చి రేపటికి తీర్పు వాయిదా వేసినట్టు న్యాయమూర్తి చెప్పారు.
ByTrinath
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, బీజేపీ , కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించారు . దీంతో బీజేపీ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. టికెట్ల కోసం రికార్డు స్థాయిలో 6 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి మినహా మిగిలిన సీనియర్లు అప్లై చేసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా ఉన్నవాళ్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయాలని హైకమాండ్ గతంలోనే చెప్పింది. అయినా కూడా సీనియర్లు దరఖాస్తు చేసుకోలేదు.
ByTrinath
తన తండ్రి చంద్రబాబు అరెస్టు విషయంలో సీఎం జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేశారు లోకేశ్. దొంగ కేసులు పెట్టి జైలుకు తరలించారన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రజలంతా ఖండించారని.. బంద్‌ని జయప్రదం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు లోకేశ్. ఇలాంటి సమయంలో తమకు సపోర్ట్ ఇచ్చినందకు పవన్‌కు, సీపీఐ, ఎంఆర్పిఎస్‌కు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
ByTrinath
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పునిచ్చిన జస్టిస్ బొక్క సత్య వెంకట హిమ బిందు పేరు మారుమోగుతోంది. 2016లో అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జ్, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లాలో విధులు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలోని పలు కోర్టుల్లో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. Justice Hima Bindu Profile
ByTrinath
చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ కోరింది. కొన్ని అంశాలపై మరిన్ని వివరాలు అడిగారు న్యాయమూర్తి. కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగారు. సెంట్రల్ జైలులో అన్ని విధాలా భద్రత ఉందని.. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని సీఐడీ తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు చెప్పారు. చంద్రబాబు బయటకు వెళ్తే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉందంటున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rohit-virat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ds-healyth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/fifaa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/it-cell-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rain-alert-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jail-cbn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bjp-list-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/naralokesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chandrababu--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbnnn-jpg.webp)