author image

Trinath

Sleep tips: రాత్రి నిద్రపోయే ముందు ఈ ఫుడ్స్‌ అసలు తినొద్దు..!
ByTrinath

నిద్రవేళకు ముందు కెఫిన్, ఆల్కహాల్, మసాలా, అధిక కొవ్వుతో పాటు హెవీగా భోజనం చేయవద్దు. పిండి పదార్థాలు, అరటిపండ్లు లాంటివి తినవచ్చు. పుచ్చకాయ, దోసకాయ లాంటి అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాలు రాత్రిపూట తీసుకుంటే తరచుగా బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది.

Amit shah visit: అమిత్‌షా వస్తున్నారు... షెడ్యూల్ ఇదే..!
ByTrinath

అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. 17న విమోచన దినోత్సవ సభలో పాల్గొననున్నారు.16న రాత్రి 8 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రానున్న అమిత్ షా.. సీఆర్పీఎఫ్‌ సెక్టార్‌ మెస్‌లో బస చేయనున్నారు. సభ తర్వాత ఢిల్లీకి కేంద్ర హోంమంత్రితెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. పార్టీ బలోపేతంపై నేతలతో మంతనాలు జరిపారు.

India vs Srilanka: శ్రీలంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా విలవిలా.. షనక సేన టార్గెట్‌ ఎంతంటే?
ByTrinath

ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంకపై పోరులో భారత్‌ బ్యాటర్లు రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్‌ మినహా మిగిలిన ప్లేయర్లు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కోహ్లీ, పాండ్యా ఫెయిల్ అయ్యారు శ్రీలంక బౌలర్లలో దునిత్‌ వెల్లాలగే ఐదు వికెట్లు తియ్యగా.. చరిత్ అసలంక 4 వికెట్లతో భారత్‌ బ్యాటర్ల నడ్డి విరిచాడు.

Nayanthara: ఈ హీరోయిన్ ఇక టాలీవుడ్‌కు దూరం.. కొత్త ఆఫర్‌లను తిరస్కరిస్తోన్న లేడీ సూపర్‌స్టార్!
ByTrinath

దాదాపు 13 సంవత్సరాలుగా, సౌత్‌లో ఓ ఊపు ఊపిన నయనతార.. 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక టాలీవుడ్ అంటే మొదట్నుంచి చిన్నచూపే ఉన్న నయనతార ఇప్పుడు మన ఇండస్ట్రీతో కలిసి పని చేయడానికి అసలు ఆసక్తి చూపడంలేదు. జవాన్‌తో, ఆమెకు పాన్ ఇండియా వైడ్‌లో చాలా పేరు వచ్చింది, ఇప్పుడు నయనతార కాల్షీట్లకు డిమాండ్ పెరిగింది.

Justice Himabindu: జడ్జి హిమబిందుకి ముప్పు ఉందా? భద్రత పెంపు..!
ByTrinath

చంద్రబాబు కేసు విచారణతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుకు భద్రత పెంచింది. 4+1 ఎస్కార్ట్ కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎలాంటి భద్రత లేదు. కోర్టుకు వచ్చి, వెళ్లే సమయంలో నిఘా పెట్టారు పోలీసులు.

KTR vs Komatireddy: ఎవడ్రా నువ్వు... కేటీఆర్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్, అమిత్‌షాని కలిసిన తర్వాత కవిత కేసు ఆగిపోయిందన్నారు కోమటిరెడ్డి. కేటీఆర్‌కి కొంత నాజెడ్జ్ ఉంది అనుకున్నానని ఈరోజు చిట్‌చాట్‌ తర్వాత కేటీఆర్‌కి ఏమీ తెలియదని అర్థమైందన్నారు. కేసీఆర్‌కి దమ్ముంటే ఆయన్ని బండ భూతులు తిట్టిన తలసానిని కేబినెట్ నుంచి తీసేయాలని ఫైర్ అయ్యారు.

Harsha Bhogle: హర్షా భోగ్లే మొదటి పే చెక్‌ ఫొటో వైరల్‌.. మీరు తోపు సర్..!
ByTrinath

వ్యాఖ్యాతగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న హర్షా భోగ్లేకు క్రికెట్ లవర్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా దురదర్శన్‌లో ప్రసారమైన మొదటి వన్డే మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన పే స్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు హర్షా. ఆ పే చెక్‌లో హర్షా జీతం రూ.350 అని ఉంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఆ యువకుడు క్రికెట్‌కు వాయిస్‌గా మారాడని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.Harsha Bhogle

Big Breaking: చంద్రబాబుకు మరో షాక్.. హౌస్‌ రిమాండ్‌కు కోర్టు నో!
ByTrinath

ఏపీ స్కి్‌ల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులోప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని ఆయన తరపున దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. వాటిని తిరస్కరించింది.

Breaking: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రేపు ఢిల్లీకి జగన్‌..!
ByTrinath

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. స్కిల్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జగన్‌ సర్కార్‌ తర్వాతి స్టెప్‌ ఏంటన్నది ఆసక్తిగా మారింది. Andhra Pradesh Assembly Sessions

Chandrababu scam case: ఆవేదనతో ఆగిన గుండె.. చంద్రబాబు అరెస్ట్ వార్తతో మరో వ్యక్తి మృతి
ByTrinath

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వార్త ఆంధ్రప్రదేశ్‌లోని చాలా మంది అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. కొందరు తమ ప్రియతమ నాయకుడి అరెస్టును తట్టుకోలేకపోతున్నారు. దీని కారణంగా విషాదకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్‌ని తట్టుకోలేక దాదాపు 14మంది చనిపోయినట్టు సమాచారం. తాజాగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన, టీడీపీ మైనారిటీ కార్యకర్త షేక్ హుస్సేన్ సాహెబ్ గుండెనొప్పితో మరణించారు.

Advertisment
తాజా కథనాలు