author image

Trinath

Slap on cheeks: చెంపపై కొడితే ఏం అవుతుందో తెలుసా? తల్లిదండ్రులు ఈ తప్పు చేయవద్దు!
ByTrinath

మన భావోద్వేగాలు ఎప్పుడూ అహింసా మార్గాల్లోనే ఉండాలి. చెయ్యి చేసుకోవడం అసలు కరెక్ట్ కాదు. కొంతమంది చీటికిమాటికి చెంపలపై కొడుతుంటారు. దీని వల్ల ఎమోషనల్ అండ్‌ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సామాజిక, చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శరీరంతో పాటు మనసుకు కూడా గాయం అవుతుంది.

BJP: తెలంగాణలో కమలం దూకుడు.. ఒకే రోజు అమిత్‌షా రెండు బహిరంగ సభలు!
ByTrinath

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర పెద్దలు నేరుగా రంగంలోకి దూకుతున్నారు. మోదీ, నడ్డా ఇప్పటికే కమలం కార్యకర్తల్లో జోష్‌ నింపగా.. అమిత్‌షా మరోసారి తెలంగాణ రానున్నారు. ఈ నెల 10న అమిత్‌షాతో ఏకంగా రెండు బహిరంగ సభలు ప్లాన్ చేసింది బీజేపీ.

Nobel Prize: నోబెల్‌కు మ్యాథ్స్‌ అంటే ఎందుకు ఇష్టంలేదు? వారికి ఈ ప్రైజ్ ఎందుకివ్వరు? ఈ లవ్‌ స్టోరీ తెలుసుకోవాల్సిందే!
ByTrinath

మ్యాథ్స్‌ ఫీల్డ్‌ వాళ్లకి నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. సోఫియా అనే మ్యాథ్స్‌ సైంటిస్టు ఎదుగుదలకు నోబెల్‌ సాయం చేశాడని.. ఆమె మాత్రం స్వీడిష్ గణిత శాస్త్రజ్ఞుడు గోస్టాతో దగ్గరగా ఉండేదన్న ప్రచారం ఉంది. ఆ కోపంతోనే మ్యాథ్స్‌ ఫీల్డ్‌ని నోబెల్ ప్రైజ్ జాబితాలో చేర్చాలేదన్న టాక్‌ ఉంది. అయితే దీనికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు.

Pawan vs Jagan: జగన్‌పై ఉన్న కేసులు ఎత్తివేస్తారా? పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

సొంత బాబాయిని హత్య చేస్తే హార్ట్ ఎటాక్ అని ప్రచారం చేసిన వ్యక్తి జగన్ అంటూ సీఎంపై నిప్పులు చెరిగారు పవన్‌ కళ్యాణ్‌. చంద్రబాబునాయుడు అవినీతి చేశారని చెప్పడం ఆరోపణ మాత్రమేనని.. రాజకీయ అంశాలలో సినిమా ఇండస్ట్రీ స్పందిస్తే వారిని టార్గెట్ చేస్తారన్నారు. జగన్‌పై కేసులు ఎత్తివేస్తే కేంద్రంతో వైసీపీకి మంచి సంబంధాలే ఉన్నాయని భావించాల్సి వస్తుందన్నారు పవన్‌.

BJP Resolutions: పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్శిటీ.. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ ఏడు తీర్మానాలు ఇవే!
ByTrinath

మహిళా రిజర్వేషన్లు, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్శిటీ, జీ-20 సమ్మిట్ సఫలం, చంద్రయాన్-3 విజయం, కృష్ణ బోర్డ్ ట్రిబ్యునల్, రాజకీయ తీర్మానం.. ఈ ఏడు తీర్మానాలను బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆమోదించారు. మహిళా రిజర్వేషన్ పై ధన్యవాద తీర్మానాన్ని డికె అరుణ పెట్టగా.. టర్మరిక్ బోర్డ్ ఏర్పాటుపై అరవింద్, రాజకీయ తీర్మానాని బండి సంజయ్, ట్రైబల్ యూనివర్శిటీ మంజూరుపై ధన్యవాద తీర్మానాన్ని సొయం బాపూరావు ప్రవేశపెట్టారు.

Gudivada amarnath vs Pawan: చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వయాగ్రా లాంటివాడు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

బలహీనపడిన టీడీపీని నువ్వు నడిపి బలవంతుడైన ఫీలింగ్‌లో ఉన్నావంటూ పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఫైర్ అయ్యారు. పవన్‌ వయాగ్రా టాబ్లెట్ అందిస్తేనే కాని చంద్రబాబు బలం చూపించలేడంటూ కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకి నువ్వు వయాగ్రా టాబ్లెట్ లాంటి వాడివని మండిపడ్డారు అమర్నాథ్‌.

Revanth Reddy :తెలంగాణలో బిల్లా రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారు.. రేవంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్!
ByTrinath

తెలంగాణలో బిల్లా, రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌కు ముఖం చెల్లక బిల్లా రంగాలు తిరుగుతున్నారని.. కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్‌ను అడిగితే చెబుతారన్నారు. Revanth Reddy

BIG BREAKING: కాంగ్రెస్‌ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!
ByTrinath

టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది.మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..మరో అద్భుత హామీపై చర్చించారు. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల ప్రభుత్వ సహాయంతోపాటు పసుపు కుంకుమల కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. Congress Manifesto

Vodafone Idea: బకాయిలు చెల్లించండి.. లేకపోతే సర్వీస్‌ ఫసక్‌ అవుతుంది.. వొడాఫోన్ ఐడియాకు వార్నింగ్‌!
ByTrinath

వొడాఫోన్ ఐడియా(వీఐ)కి గడ్డుకాలం నడుస్తోంది. ఇండస్ టవర్స్ డబ్బుల చెల్లింపులో వేల కోట్ల బాకీ పడిపోయిన వీఐ తన సర్వీసులను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. బాకీలు చెల్లించకపోతే వీఐ సర్వీసులను పరిమితం చేస్తామని ఇండస్‌ టవర్స్‌ ట్రాయ్‌కి చెప్పింది. ఇదే జరిగితే వొడాఫోన్‌ ఐడియా యూజర్లు ఎయిర్‌టెల్‌, జియో లేదా ఇతర నెటవర్క్‌లకు షిఫ్ట్ అయ్యే అవకాశాలుంటాయి.

SBI Jobs: రూ.63వేల శాలరీతో ఎస్బీఐ జాబ్స్‌.. అప్లికేషన్‌కి గడువు పొడిగింపు..!
ByTrinath

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా www.sbi.co.in అధికారిక వెబ్సైట్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 439 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు డేట్‌ని అక్టోబర్‌ 21వరకు పొడిగించారు. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్లతో సహా వివిధ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు