author image

Nikhil

TS Politics: వరంగల్ మేయర్ పై అవిశ్వాసం.. కొండా సురేఖ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ByNikhil

వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కౌన్సిలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఈ గండం నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ లో చేరాలని సుధారాణి భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. కొండా సురేఖ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తిగా మారింది.

CM Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్
ByNikhil

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారి, ప్రముఖ కాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి తదితరులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం సీఎంను కలిశారు.

TS Politics: బీజేపీకి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా.. త్వరలోనే జయసుధతో పాటు మరో నేత కూడా?
ByNikhil

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే జయసుధ, ఆకుల రాజేందర్, మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వీరంతా కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.

TSPSC New Chairman: మరో వారంలో టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్‌.. వారిలో ఒకరికే ఛాన్స్?
ByNikhil

టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో కొత్త ఛైర్మన్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళితో పాటు ఐఏఎస్ అధికారులు అనితా రామచంద్రన్‌, శైలజా రామయ్యర్‌, వాణి ప్రసాద్‌ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Kesineni Nani: ఆ 5 టికెట్లు ఇవ్వాల్సిందే.. జగన్ కు కేశినేని నాని పెట్టిన డిమాండ్లు ఇవే?
ByNikhil

టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ రోజు తన కుమార్తె శ్వేతతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే.. ఒక ఎంపీ టికెట్ తో పాటు, నాలుగు ఎమ్మెల్యే టికెట్లను కూడా తాను సూచించిన వారికి ఇవ్వాలని జగన్ ను ఆయన కోరినట్లు తెలుస్తోంది.

TS Congress : నల్గొండ కాంగ్రెస్ టికెట్ రేసులో ఊహించని పేరు.. పటేల్ రమేష్ రెడ్డికి మళ్లీ షాక్?
ByNikhil

సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పడు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు