author image

Bhoomi

Oscars 2024 : 96వ ఆస్కార్ వేడుకలకు సమయం ఆసన్నమైంది...ఎక్కడ చూడొచ్చంటే..!
ByBhoomi

Oscars Awards 2024 : ప్రపంచవ్యాప్తంగా సినీప్రముఖులతోపాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 96వ అకాడమీ అవార్డ్స్ మరికొద్దిగంటల్లో ప్రారంభం కాబోతోంది. భారతదేశంలోని వీక్షకులు మార్చి 11, సోమవారం ఉదయం ఈ అవార్డుల వేడుకను చూడవచ్చు. ఆస్కార్ అవార్డ్స్ 2024 ప్రత్యక్ష ప్రసారాన్ని భారతదేశంలోని వీక్షకులు ఎక్కడ..ఎలా..వీక్షించాలో తెలుసుకుందాం.

BSP: మాయవతి ట్వీట్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ..అవన్నీ తప్పుడు ఊహాగానాలే.!
ByBhoomi

బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి చేసిన ట్వీట్ ను అర్థం చేసుకోకుండా కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గతంలో అనేక సార్లు మాయావతి గారు మేము ఏ జాతీయ పార్టీలతో కానీ, ఎన్డీయే, ఇండియా కూటములతో కానీ పొత్తుపెట్టుకోమని చాలా స్పష్టంగా చెప్పారు. యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.

Health Tips: 50ఏళ్ల తర్వాత కూడా ఫిట్‎గా ఉండాలంటే ఈ యోగా చేయాల్సిందే..!!
ByBhoomi

రోజూ యోగా చేయడం వల్ల అనేక రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. యోగా వల్ల వృద్ధాప్యంలో కూడా కంటి చూపు, కండరాలు దృఢత్వం, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు దరిచేరవు. కాబట్టి ఈ యోగాసనాలతో 50 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండండి.

Miss World 2024 Winner : మిస్ వరల్డ్ 2024-చెక్ రిపబ్లిక్‌ భామ క్రిస్టినా..రన్నరప్ ఎవరంటే?
ByBhoomi

మిస్ వరల్డ్ 2024 పోటీలో, 112 దేశాల నుండి అందగత్తెలు పోటీపడ్డారు.ఈ పోటీ ఫైనల్ ముంబై వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ పోటీలో మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా అందుకున్నారు. టాప్ 4లో క్రిస్టినా పిస్కోవా, యాస్మిన్ అజైటౌన్, అచే అబ్రహాంస్, లీసాగో చోంబోలు నిలిచారు. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజైటౌన్ నిలిచారు.

Modi in Varanasi : కాశీలో హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.!
ByBhoomi

లోక్‌సభ ఎన్నికలకు మూడోసారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత తొలిసారి కాశీకి చేరుకున్న ప్రధాని మోదీకి శనివారం రాత్రి ఘనస్వాగతం లభించింది. హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. బబత్‌పూర్ నుండి విశ్వనాథ్ ధామ్ మీదుగా బనారస్ రైల్వే ఇంజిన్ ఫ్యాక్టరీ వరకు 28 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో మోదీపై పూలవర్షం కురిపించారు ప్రజలు.

Dubai : ఎడారి దేశంలో దంచికొడుతున్న వానలు..నదులను తలపిస్తోన్న రోడ్లు..!
ByBhoomi

దుబాయ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. దుబాయ్ లో సంవత్సరం సగటు వర్షపాతం 120 మిల్లీ మీటర్లు. ఇప్పుడు కేవలం ఆరు గంటల్లోనే 50 మి.మి వర్షాపాతం నమోదు అయ్యింది.

TS Cabinet : ఈనెల 12న మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్.!
ByBhoomi

Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఈనెల 12వ తేదీన సచివాలయంలో భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం.

Flight: పైలట్ల నిర్వాకం..దారి తప్పిన విమానం..ఏమైందంటే.!
ByBhoomi

విమానం నడుపుతున్న పైలెట్లు ఇద్దరు నిద్రపోవడంతో విమానం అరగంటపాటు దారితప్పి ప్రయాణించింది. అరగంట తర్వాత పైలట్ కు మెలకువ రావడంతో అధికారులతో సంప్రదించి దారితప్పిన విమానాన్ని తిరిగి గాడిలో పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 153మంది ప్రయాణికులు, 4సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది.

Free Electricity : ఈ ఒక పనిచేస్తే చాలు..రైతులకు ప్రతినెలా 1045 యూనిట్ల ఫ్రీ విద్యుత్..!
ByBhoomi

రైతన్నల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక ఏడాది వర్షాలు పడకపోతే..పంట చేతికి వచ్చే సమయానికి అకాలు వర్షాలు పడితే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. రైతుల విషయంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో ప్రభుత్వం రైతులకు గొట్టపు బావులకు ఫ్రీ విద్యుత్ అందిస్తోంది. ఈ మేరకు యూపీ పవర్ కార్పొరేషన్ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

Rohit Sharma : రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..!
ByBhoomi

తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను ఖండించిన రోహిత్...తాను ఎప్పుడైతే సరిగ్గా ఆడటం లేదని భావిస్తానో అప్పుడే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానంటూ పేర్కొన్నాడు. తాను గతకొంతకాలంగా అద్భుతంగా ఆడుతున్నానంటూ వివరించాడు.

Advertisment
తాజా కథనాలు