కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహం నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. రూ300కోట్లతో నిర్మించిన ఈ ఆలయం రెండేళ్లలో అందుబాటులోకి రానుంది.

BalaMurali Krishna
ఈ ప్రపంచంలో ఎవరి మత విశ్వాసాలు వారికుంటాయి. మీ మతాన్ని అభిమానించండి.. పరమతాన్ని గౌరవించండి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తుల తీరుతో కొన్ని మతాలకు చెందిన భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. తాజాగా హాలీవుడ్ సినిమాలోని ఓ సన్నివేశంపై హిందూవులు తీవ్రంగా మండిపడుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాలు రెండుగా చీలిపోయాయి. తాజాగా మంత్రి వేణుపై ఎంపీ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొన్నిరోజులుగా ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. చెరువులన్ని నిండుకుండల్లా దర్శనిమిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధానమైన ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయారు.
తెలంగాణలో మరో 100 రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సమరానికి త్వరలోనే శంఖం పూరించనుంది. ఆగస్టు నెలలో సిటింగ్ ఎమ్మెల్యేలతో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను అధినేత కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొంతమంది సిటింగ్ ఎమ్మెల్యేలతో ఆయన వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ గుమ్మమైనా ఖమ్మం జిల్లాలో ఈసారి ఎలాగైనా గులాబీ జెండా ఎగరవేయాలని డిసైడ్ అయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు శుభవార్త అందించారు. రూ.1000 పింఛన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 5.20లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం రూ.3,016 ఇస్తున్న సంగతి తెలిసిందే.
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడూ ఎదురుచూస్తున్న 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. తొలిసారి మామాఅల్లుళ్లు నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌కు పునకాలు తెప్పిస్తోంది. ట్రైలర్‌లో పవన్, తేజు కెమిస్ట్రీ అదరగొట్టింది. దీంతో థియేటర్లలో సినిమా చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.
బంతి బంతికి ఉత్కంఠ. క్షణం క్షణం టెన్షన్. భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచులో అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో ముగిసింది.
టమాటా ధరలు పెరగడంతో ఆ పంట పండించే రైతుల పంట పడింది. ఒకప్పుడు ధరలు లేక రోడ్లపై పంటను పారబోసిన రైతులు ఇప్పుడు దర్జాగా పంటను అమ్ముకుంటున్నారు. కొందరు లక్షలు అందిస్తుంటే.. మరికొందరు కోట్లకు పడగెత్తుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ రైతు కూడా స్థానం సంపాదించుకున్నాడు.
గోదావరి జిల్లాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న చేప ఏది అంటే టక్కున పులస అని చెబుతాం. పులస చేపకు అంత క్రేజ్ ఉంటుంది మరి. అందుకే పుస్తెలమ్మైనా సరే పులస చేపలు తినాలి అని అంటుంటారు. కానీ పులస కంటే ఎక్కువ ధర పలికే చేపలు అరుదుగా లభిస్తూ ఉంటాయి. అదే కచిడి చేప. కాకినాడ జిల్లాల్లో దొరికిన ఈ చేప మత్స్యకారులకు లక్షలు సంపాదించి పెట్టింది.
Advertisment
తాజా కథనాలు