author image

BalaMurali Krishna

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ByBalaMurali Krishna

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ ట్రాన్స్‌జెండర్ పోరాటానికి సలాం.. కొత్త చరిత్రకు శ్రీకారం
ByBalaMurali Krishna

ట్రాన్స్‌జెండర్లు అంటే సమాజంలో చులకన ఉంటుంది. వారిని అందరూ చిన్నచూపు చూస్తుంటారు. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు చేసే తప్పుల వల్ల మొత్తం ఆ కమ్యూనిటికే చెడ్డ పేరు వస్తుంది. వారు భిక్షాటన చేయడానికి తప్ప ఇంకెందుకు పనికి రారనే భావన ఉంది. కానీ తెలంగాణకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది.

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు.. ఉద్రిక్తత
ByBalaMurali Krishna

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు, కమలం నేతల మధ్య తోపులాటలు జరిగాయి. కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Heath Streak: జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన ఒలంగా
ByBalaMurali Krishna

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌ హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారు. స్ట్రీక్ మరణించలేదని.. కొద్దిసేపటి క్రితమే తనతో మాట్లాడినట్లు సహచర ఆటగాడు హెన్రీ ఒలంగా స్పష్టంచేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.Heath Streak not dead

కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయడానికి కారణాలేంటి.. వ్యూహమా? భయమా?
ByBalaMurali Krishna

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే కేసీఆర్ మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేయడానికి కారణాలు ఏంటి? రాజకీయ వ్యూహమా? ఓడిపోతాననే భయమా? రీడ్ దిస్ స్టోరీ.

భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తి నేతల మంతనాలు
ByBalaMurali Krishna

బీఆర్‌ఎస్ టికెట్లు రాని అభ్యర్థులు బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమె భర్త శ్యామ్ నాయక్ సోమవారం రాత్రే రేవంత్ రెడ్డి, ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె బాటలోనే మరికొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

Delhi: ఢిల్లీలో దుమారం రేపుతున్న మైనర్ బాలిక అత్యాచార ఘటన
ByBalaMurali Krishna

ఢిల్లీలో ఓ మైనర్‌ బాలిక అత్యాచార ఘటన దుమారం రేపుతోంది. ఓ ప్రభుత్వ అధికారే నెలల తరబడి ఆమెపై పైశాచికంగా ప్రవర్తించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గర ధర్నాకు దిగారు DCW చీఫ్‌ స్వాతి మలివాల్‌.Delhi minor rape case

Kavitha: కిషన్ రెడ్డికి కవిత కౌంటర్.. మహిళా బిల్లుపై ప్రశ్నల దాడి
ByBalaMurali Krishna

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్‌లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్
ByBalaMurali Krishna

సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. నిర్మల్ నుంచి బతుకుతెరవు కోసం కుమార్తె, కుమారుడితో కలిసి ఓ మహిళ హైదరాబాద్‌కు వచ్చారు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఆమె కుమారుడిని పక్క గల్లీలో నివాసముండే ఆటో డ్రైవర్ గొంతు కోశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన గాంధీ హాస్పిటల్ తీసుకువచ్చారు.

ఇది కదా మెగా ఫ్యాన్స్ అంటే.. చిరంజీవికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు
ByBalaMurali Krishna

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి అభిమానుల వరకు అందరూ అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కొంత మంది అభిమానులు చిరు మీద ఉన్న తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మెగా ఫ్యాన్స్ బర్త్‌డే విషెస్ తెలియజేసిన వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Advertisment
తాజా కథనాలు