జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య అభిమానుల వరకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రక్తదానాలతో పాటు అన్నదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.PawanKalyan Birthday Wishes

BalaMurali Krishna
యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించడం విశేషం.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు జనతాదళ్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ చెబుతూ ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసింది.
వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఆమె తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న షర్మిల ఓ స్కూల్‌లోని విద్యార్థులతో కలిసి సందడి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారనే వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం సృష్టించిన దీప్తి మృతి కేసులో మిస్టరీ వీడనుంది. హైదరాబాద్‌లో చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీప్తి మృతి తర్వాత 40 తులాల బంగారం, రెండు లక్షల రూపాయలను తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదు, బంగారంతో పాటు పాస్ పోర్టు కూడా తీసుకెళ్లడంతో ఆమె విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.Korutla Deepthi Case
అమరావతి ఆర్5 జోన్ అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆర్- 5 జోన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ నెలకు వాయిదా వేసింది.Amaravati R5 Zone
Advertisment
తాజా కథనాలు