Australia Flight : విమానంలో నగ్నంగా పరిగెత్తిన ప్రయాణికుడు.. సిబ్బందిని కిందకు తోసేసి దారుణం!

ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుడు వింత ప్రవర్తనతో గందరగోళం సృష్టించాడు. పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు వచ్చిన VA696 విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి నగ్నంగా పరుగులు తీశాడు. అడ్డుకున్న సిబ్బందిని పక్కకు తోసేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Australia Flight : విమానంలో నగ్నంగా పరిగెత్తిన ప్రయాణికుడు.. సిబ్బందిని కిందకు తోసేసి దారుణం!

Australia : ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుడు వింత ప్రవర్తనతో గందరగోళం సృష్టించాడు. పెర్త్‌ (Perth) నుంచి మెల్‌బోర్న్‌ (Melbourne) కు వచ్చిన VA696 విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి నగ్నంగా పరుగులు తీశాడు. అడ్డుకున్న సిబ్బందిని పక్కకు తోసేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వింత ఘటన వర్జిన్‌ ఆస్ట్రేలియా (Virgin Australia Flight) విమానంలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు VA696 విమానం సోమవారం రాత్రి బయలుదే టేకాఫ్‌ అయింది. ఈ క్రమంలోనే కాసేపటికి ఓ ప్రయాణికుడు తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరుగుతు తీశాడు. అడ్డుకున్న సిబ్బందిని కింద పడేశాడు. దీంతో ప్రయాణికులంగా హడలెత్తిపోయారు. విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‘ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు’ అని అధికారులు తెలిపారు.

Also Read : మూడు రోజులు వైన్స్ బంద్.. డీజీపీ కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు