సోషల్‌మీడియాను కుదిపేస్తున్న బెయిర్‌స్టో అవుట్ వివాదం.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

రెండో టెస్టులో బెయిర్‌స్టో అవుట్ వివాదంపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బెయిర్‌స్టో రనౌట్‌ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధమని ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ వాపోతున్నారు. మరికొందరు ఆస్ట్రేలియా చీట్ చేసిందంటున్నారు. అయితే ఎంసీసీ నిబంధనల్లోని 20.1.1.1 ప్రకారం బెయిర్‌స్టోది అవుటే. బాల్‌ డేడ్‌ అవ్వకపోముందే క్రీజు కదలకూడదు.

New Update
సోషల్‌మీడియాను కుదిపేస్తున్న బెయిర్‌స్టో అవుట్ వివాదం.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

ఆస్ట్రేలియా మరోసారి చీట్ చేసిందా..? యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో బెయిర్‌స్టో అవుటా.. నాటౌటా..? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ఇప్పుడివే ప్రశ్నలు సోషల్‌మీడియాలో ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌ క్రికెట్ అభిమానులు ఆస్ట్రేలియాను చీటర్స్‌ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే బుద్ధి ఆస్ట్రేలియాకు ఎప్పుడూ ఉంటుందని..అందుకే బెయిర్‌స్టోని ఇలా అవుట్ చేసిందని మండిపడుతున్నారు. రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఐదు టెస్టుల సిరీస్‌లో కంగారూలు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లారు. అయితే రెండో టెస్టు ఐదో రోజు ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెయిర్‌స్టో ఔటైన విధానం వివాదానికి దారితీసింది.

బెయిర్‌స్టో ఎలా అవుట్ అయ్యాడు?
ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్‌స్టోను వికెట్ కీపర్ అలెక్స్ కేరీ స్టంపౌట్ చేశాడు. అదీ ఎవరూ ఊహించని రీతిలో వికెట్ తీశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 52 ఓవర్‌ వేసిన కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో ఆఖరి బంతిని బెయిర్‌ స్టో లీవ్ చేశాడు. ఈ క్రమంలో బంతి కీపర్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఓవర్‌ ముగిసిందని భావించిన జానీ బెయిర్‌స్టో.. క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ బంతిని స్టంప్స్‌కు త్రో చేసి రనౌట్‌కి అప్పీల్‌ చేశాడు. అయితే బెయిర్‌స్టో కనీసం కీపర్‌కి కానీ, అంపైర్‌కీ కానీ సిగ్నల్‌ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్‌ అంపైర్‌ రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో బెయిర్‌స్టో రనౌట్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బెయిర్‌స్టో రనౌట్‌ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధమని ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ వాపోతున్నారు. అటు ఆస్ట్రేలియా రనౌట్‌ అప్పీల్‌ను ఉపసంహరించుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. కొంత మంది ఆసీస్‌కు ఇది అలవాటే అని, ఛీటర్స్‌ అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఛీటర్స్‌ అంటూ గట్టిగా అరిచారు.

publive-image బెయిర్‌స్టో అవుట్ వివాదం

ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
ఎంసీసీ నిబంధనల్లోని 20.1.1.1 ప్రకారం.. ఓ బాల్ వికెట్ కీపర్ లేదా బౌలర్ చేతుల్లోనే ఉండిపోతే డెడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ క్యారీ మాత్రం బంతి అందుకున్న వెంటనే విసిరేశాడు. దీంతో అది డెబ్ బాల్ కాదు. ఇక్కడ బెయిర్‌స్టో నిర్లక్ష్యమే అతని కొంప ముంచింది. ఓవర్లో చివరి బంతి అయినా సరే.. వెనుక ఉన్న వికెట్ కీపర్ చేతుల్లోనే బంతి ఉందా లేదా చూసి క్రీజు వదలాలి. కానీ ఇక్కడ అతడు మాత్రం వెనక్కి చూడకుండా ముందుకు వచ్చేశాడు. అది డెబ్ బాలా కాదా అన్నదానిపై తుది నిర్ణయం అంపైర్‌దే. అది డెడ్ బాల్ కాదని అంపైర్ ఈజీగానే తేల్చేశారు. అందుకే బెయిర్‌స్టోను అవుట్‌గా ప్రకటించారు. కీలకమైన సమయంలో బెయిర్‌స్టో అవుట్‌ అవ్వవం ఇంగ్లండ్ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 155 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. 327 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్.. 43 పరుగులతో ఓడింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు