చంద్రయాన్ ల్యాండింగ్ తేదీ మారనుందా... ఈ నెల 27న ల్యాండ్ కానుందా..! చంద్రయాన్-3 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండింగ్ అవుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్ర వేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని భారతీయులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ కీలక విషయాన్ని వెల్లడించారు. 23న అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ల్యాండింగ్ జరుగుతుందన్నారు. By G Ramu 21 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి చంద్రయాన్-3 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండింగ్ అవుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్ర వేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని భారతీయులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ కీలక విషయాన్ని వెల్లడించారు. 23న అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ల్యాండింగ్ జరుగుతుందన్నారు. ఏ మాత్రం అననుకూల వాతావరణం వున్నా ఈ నెల 27 మళ్లీ తాజాగా ల్యాండింగ్ ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే రెండు గంటల ముందు అన్ని పరిస్థితులను తాము అంచనా వేస్తామన్నారు. అప్పటి పరిస్థితులకు అనుకూలంగా ల్యాండర్ ను చంద్రునిపై ల్యాండ్ చేయాలా లేదా చేయకూడదా అనే విషయంపై ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఒక వేళ ఏదైనా అంశం అనుకూలంగా లేదని భావిస్తే మాడ్యూల్ ను ఈ నెల 27న ల్యాండ్ చేస్తామని ఇస్రో స్పేస్ అప్లికేషన్ డైరెక్టర్ నీలేశ్ ఎన్ దేశాయ్ తెలిపారు. ముందుగా అనుకున్న సమయానికే మాడ్యుల్ ల్యాండర్ చంద్రునిపై చంద్రునిపైకి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 23న సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవుతుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఒక వేళ ఈ మిషన్ సక్సెస్ అయితే ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. అంతకు ముందు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. ఇటీవల రష్యాకు చెందిన లూనా-25 మిషన్ విఫలం అయింది. దీంతో చంద్రయాన్-3 సక్సెస్ అయితే చంద్రుని దక్షిణ ద్రువంపై ల్యాండింగ్ సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. #module #vikram-lander #chandrayan #isro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి