Italy: 10 వేల అడుగుల ఎత్తు నుంచి పడి..ఆడి ఇటలీ అధినేత మృతి!

ఇటలీ-స్విట్జర్లాండ్‌ సరిహద్దుల్లో ఆదివారం పర్వతారోహణ చేస్తూ ఆడి ఇటలీ బాస్‌ ఫబ్రిజియో లోంగొ మరణించారు. పదివేల అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పొయారు.

New Update
Italy: 10 వేల అడుగుల ఎత్తు నుంచి పడి..ఆడి ఇటలీ అధినేత మృతి!

Italy: ఆడి ఇటలీ బాస్‌ ఫాబ్రిజియో లాంగో(62)10 వేల అడుగుల ఎత్తు పర్వతం పై నుంచి పడి మరణించాడు. ఇటాలియన్‌- స్విస్‌ సరిహద్దుకు సమీపంలోని ఆడమెల్లోని పర్వతాన్ని ఆయన అధిరోహిస్తున్న సమయంలో 10 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడి చనిపోయారు. ఫాబ్రిజియో లాంగో.. పర్వతానికి చేరువవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి లోయలోకి పడినట్లు తెలుస్తోంది.

తోటి పర్వతారోహకులు ఈ సంఘటనను గమనించి రెస్క్యూ బృందాలకు సమాచారం అందిచారు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ బృందాలు ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని 700 అడుగుల లోయలో కనుగొన్నారు. హెలికాప్టర్‌లో మృతదేహాన్ని కారిసోలోలోని ఆసుపత్రికి తరలించారు. ఫాబ్రిజియో లాంగో 1962లో ఇటలీలోని రిమినిలో జన్మించాడు. పొలిటికల్ సైన్స్‌ పూర్తి చేసిన ఈయన.. 1987లో ఫియట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆయన తన మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఆ తర్వాత 2002లో లాన్సియా బ్రాండ్‌కు నాయకత్వం వహించారు.

2012లో ఆడి కంపెనీలో చేరారు. 2013లో ఇటాలియన్ కార్యకలాపాలకు డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం అతని మరణానికి సంబంధించిన పరిస్థితులపై విచారణ జరుగుతోంది.

Also Read: బంగారం కొనాలంటే మంచి టైమ్.. ఈరోజు తులం ఎంతంటే.. 

Advertisment
తాజా కథనాలు