YCP Vice MP Shankar: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ అధికార పార్టీ వైసీపీలో ఆదిపత్య పోరు నడుస్తోంది. తనకు అడ్డు పడుతున్నాడని సొంత పార్టీ నేతలే ఎచ్చెర్ల వైస్ ఎంపీపీ జరుగుళ్ల శంకర్ పై గుర్తు తెలియని దుండగులతో దాడి చేయించినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు బైక్ వచ్చి అతనిని వెంబండించి మరి దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో శంకర్ కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎచ్చెర్ల మండలం వైసీపీ మాజీ అధ్యక్షులుగా ఉన్న కీలక నేతపై దాడి చేయడంతో చిక్కోలు వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పూర్తిగా చదవండి..YCP: వైసీపీ వైస్ ఎంపీపీపై దుండగుల దాడి..!
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం వైసీపీ వైస్ ఎంపీపీ జరుగుళ్ల శంకర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఎంపీపీ మొదలవలస చిరంజీవి తనను మట్టు పెట్టేందుకు యత్నించారంటున్నారు శంకర్. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
Translate this News: