YCP: వైసీపీ వైస్ ఎంపీపీపై దుండగుల దాడి..!

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం వైసీపీ వైస్ ఎంపీపీ జరుగుళ్ల శంకర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఎంపీపీ మొదలవలస చిరంజీవి తనను మట్టు పెట్టేందుకు యత్నించారంటున్నారు శంకర్. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

New Update
YCP: వైసీపీ వైస్ ఎంపీపీపై దుండగుల దాడి..!

YCP Vice MP Shankar:  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ అధికార పార్టీ వైసీపీలో ఆదిపత్య పోరు నడుస్తోంది. తనకు అడ్డు పడుతున్నాడని సొంత పార్టీ నేతలే ఎచ్చెర్ల వైస్ ఎంపీపీ జరుగుళ్ల శంకర్ పై గుర్తు తెలియని దుండగులతో దాడి చేయించినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు బైక్ వచ్చి అతనిని వెంబండించి మరి దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో శంకర్ కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎచ్చెర్ల మండలం వైసీపీ మాజీ అధ్యక్షులుగా ఉన్న కీలక నేతపై దాడి చేయడంతో చిక్కోలు వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Also Read: బీ కేర్ ఫుల్.. జనసైనికులకు పార్టీ అధినేత పవన్ హెచ్చరిక..!

ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఎంపీపీ మొదలవలస చిరంజీవి తనను మట్టు పెట్టేందుకు యత్నించారంటున్నారు బాధితుడి శంకర్. దీంతో తమ నాయకుడిపై దాడి చేసిన వారిని కఠినంగా  శిక్షించాలని శంకర్ అనుయాయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్యా రాజకీయాలకు తెర తీసిన వారికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం మూడు బృందాలుగా ఏర్పడి వేట మొదలుపెట్టారు.

Also Read: జగన్ కుంభకర్ణుడు.. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా?.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న షర్మిల..!

సొంత పార్టీకి చెందిన నేతలే దాడి చేయించారంటూ నియోజకర్గంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అనుమానం ఉన్న నేతలపై కేడర్ సైతం మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అందరు కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సింది పోయి ఇలా దాడులు చేస్తున్నారేంటి అని నిప్పులు చెరుగుతున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆసుపత్రి వద్ద ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు