AP: ఏలూరు జిల్లాలో దారుణం.. గిరిజనులపై దాడి..!

ఏలూరు జిల్లా మర్రిగూడెంలో భూ తగాదాల నేపథ్యంలో ఇద్దరు గిరిజనులపై దాడి జరిగింది. గత ముప్పై ఏళ్లుగా స్థానిక గిరిజనులు సాగు చేస్తోన్న సీలింగ్ భూములపై అదే గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు కన్నేశారు. భూ అక్రమణకు అడ్డువస్తున్నారనే అక్కసుతో వారిని పిలిపించి కర్రలతో దాడి చేశారు.

New Update
AP: ఏలూరు జిల్లాలో దారుణం.. గిరిజనులపై దాడి..!

Eluru: భూ తగాదాల నేపథ్యంలో ఇద్దరు గిరిజనులపై దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా బుట్టయిగూడెం మర్రిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గత ముప్పై ఏళ్లుగా స్థానిక గిరిజనులు సాగు చేస్తోన్న సీలింగ్ భూములపై అదే గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు కన్నేశారు. దాదాపు 23 ఎకరాలకు సంబంధించిన భూ అక్రమణకు గిరిజనులు అడ్డువస్తున్నారనే అక్కసుతో ఈరోజు ఆ గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులను పనుల నిమిత్తం పొలానికి పిలిపించి వారిపై కర్రలతో దాడి చేశారు.

Also Read: నాకు అన్యాయం చేశారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్..!

విషయం తెలుసుకున్న మర్రిగూడెం గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని మర్రిగూడెంకు చెందిన పార్వతి, దుర్గారావు, ఆనందరావులుగా గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు గిరిజనులపై దాడి నేపథ్యంలో ప్రజాసంఘాల నాయకులు జంగారెడ్డిగూడెం రెవిన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎల్టీఆర్ భూములు గిరిజినలకే చెందుతాయని, వారు సాగు చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి భూ ఆక్రమణ కార్యకలాపాలను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు