Attack on TDP Office Case: టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో పోలీసులు వేగం పెంచారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు ఖాజామొహిద్దీన్ ను అరెస్ట్ చేశారు. రోషన్, రాములతో పాటు మరో ముగ్గుర్ని సైతం మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరు అనుచరులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: పవన్ ఎంట్రీతో వీడిన మిస్సింగ్ మిస్టరీ.. 9 నెలలుగా ఆ యువతి ఎక్కడుందో తెలుసా?
మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్లు నిర్ధారించారు. ఏడుగురు నిందితులూ తాడేపల్లికి చెందిన వారేనని తెలుస్తోంది. వైసీపీ నేతలు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో దాడి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీసీ కెమెరాల ద్వారా నిందితులను స్పెషల్ పోలీస్ టీమ్ గుర్తిస్తోంది. 150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అంతా గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారేనని తెలుస్తోంది.
దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై పోలీసుల ఫోకస్ పెట్టారు.