TDP Leader Varma: వర్మపై జనసేన నేతల దాడి!.. పిఠాపురంలో హైవోల్టేజీ ఫైట్ AP: టీడీపీ నేత వర్మపై దాడి జరగడంతో పిఠాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వర్మపై జనసేన నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరులు దాడి చేసినట్లు వర్మ పోలీసులకు తెలిపారు. నిన్న జరిగిన దాడిలో స్వల్ప గాయాలతో వర్మ, అతని అనుచరులు బయటపడ్డారు. By V.J Reddy 08 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Attack On TDP Leader Varma: పిఠాపురంలో వర్మపై దాడితో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో నిన్న రాత్రి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. ఎన్నికలకు సపోర్ట్ చేసిన వారిని కలిసేందుకు వెళ్లారు వర్మ. వర్మను టీడీపీ నుంచి సస్పెండై జనసేనలోకి వెళ్లిన నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ, వర్మ కారుపై రాళ్లు, బాటిళ్లతో దాడి చేశారు. అడ్డుకున్న వర్మ అనుచరుల కారు అద్దాలు ధ్వంసం చేశారు. స్వల్ప గాయాలతో వర్మ, అతని అనుచరులు బయటపడ్డారు. దాడిపై తీవ్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బవిరిశెట్టి రాంబాబు సస్పెండ్ చేశారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు రాంబాబు, అతని అనుచరులు. ఇప్పుడు వాళ్లే దాడి చేయడంతో వర్మకు, ఉదయ్ శ్రీనివాస్‌కు మధ్య ఉన్న కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. #tdp-ex-mla-varma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి