నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీ అరాచకానికి ఈ ఘటన నిదర్శనం అంటున్న ప్రతిపక్షాలు.!

నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ను దుండగులు చితకబాదిన ఘటన వైరల్ గా మారింది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన టూవీలర్ తీయమని డ్రైవర్ హారన్ కొట్టడంతో దుండగులు దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులు గుద్ది తన్నులతో రెచ్చిపోయారు. వారి దాడిలో డ్రైవర్ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. అయితే, ఈ దాడి చేసింది వైసీపీ నాయకులేనని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

New Update
నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీ అరాచకానికి ఈ ఘటన నిదర్శనం అంటున్న ప్రతిపక్షాలు.!

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ని కావలి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ ఘటనలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. శివారెడ్డి, మల్లి, విల్సన్, కిరణ్, దేవరకొండ సుదీర్ల పాటు మరో పదిమంది మీద హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంగళరావు నగర్ లో ప్రత్యేకంగా స్థావరం ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఘటనలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

Also Read: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కేరళ.. అసలేమైందంటే?

రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమని ఎంప్లాయీస్ యూనియన్ ఒంగోలు డిపో కార్యదర్శి జి.మాధవరావు, అధ్యక్షుడు ఎం. వెంకట్రావులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బందిపై దాడులు పెరిగాయన్నారు. కావలిలో విధుల్లో ఉన్న విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాణహాని కలిగించేలా విచక్షణ రహితంగా దాడి చేయడం, అడ్డుకోబోయిన మరో డ్రైవర్ పై సైతం దౌర్జన్యానికి దిగడం హేయమైన చర్య అన్నారు. దాడికి నిరసనగా ఆదివారం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి విధుల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఛైర్మన్ జి.నాగరాజు, కోశాధికారి కె.అంకినీడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: అంతవరకు తెచ్చుకోకండి.. వైసీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్..

అయితే, ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వైసీపీ అరాచకానికి కావలి ఘటనే నిదర్శనమని విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్పా.. అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడంలేదని ధ్వజమెత్తుతున్నారు. అధికార దుర్వినియోగం, అందుకు అహంకారం కూడా తోడవడంతో వైసీపీలో ప్రతీ స్థాయి నాయకుడు ప్రజల మీద, ఉద్యోగుల మీద దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు