/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T230235.028.jpg)
Chirri Balaraju: ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో ఎమ్మెల్యే కారుపై విరుచుకుపడ్డారు. సాయంత్రం బాలరాజు ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఒక్కసారిగా కారుపై దాడి చేశారు దుండగులు.
అయితే సోమవారం ఉదయం ఐటీడీఏ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే బాలరాజు.. డ్యూటీ సమయంలో ఫోన్‌లో పబ్‌జి ఆడుతోన్న సాయి కుమార్ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి కుమార్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సాయి కుమార్ వర్గం దాడి చేసిందా? లేక ఇంకేదైన కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి.. పవన్
ఇక ఈ ఘటనపై స్పందించిన జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొద్దిసేపటి క్రితం బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే శ్రీ బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారి వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. కొద్దిసేపటి క్రితం బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు…
— JanaSena Party (@JanaSenaParty) July 29, 2024