AP: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జరిగిన దాడి ఘటనపై జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనపై రేపటిలోగా పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర డీజీపీ కార్యాలయం వీలైనంత త్వరగా పూర్తి నివేదిక సమర్పించాలని విజయవాడ సీపీకి సూచించింది.
ఆగంతకుల రాళ్ల దాడి..
ఇక శనివారం రాత్రి విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. ప్రజలు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసరడంతోజగన్ ఎడమ కంటికి బలంగా ఓ రాయి తగిలింది. దీంతో ఆయనను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది.
మోడీ, చంద్రబాబు స్పందన..
అయితే ఈ దాడిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పై దాడిని ఖండించారు. జగన్ పైదాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈసీని కోరుతామని, నిర్లక్షం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.