కెనడాలో భారతీయ విద్యార్థిపై దుండగుల దాడి..చికిత్స పొందుతూ మృతి..!!

కెనడాలో పిజ్జా డెలివరీ చేస్తున్న భారతీయ విద్యార్థిపై దుండగులు దాడిచేశారు. దుండగుల దాడిలో తీవ్ర గాయాలైన విద్యార్థి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన కెనడాలోని మిస్సిసాగాలో చోటుచేసుకుంది.

కెనడాలో భారతీయ విద్యార్థిపై దుండగుల దాడి..చికిత్స పొందుతూ మృతి..!!
New Update

publive-image

కెనడాలో విషాదం నెలకొంది. భారతీయ విద్యార్ధిపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన జూలై 9 తెల్లవారుజామున బ్రిటానియా, క్రెడిట్ వ్యూ, రోడ్ ల దగ్గర చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని గుర్విందర్ నాథ్ గా గుర్తించారు. గుర్విందర్ నాథ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేస్తూ పార్ట్ టైంగా ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.

గుర్విందర్ నాథ్ జూలై9న తెల్లవారుజామున 2.10 గంటలకు పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు అతనిపై దాడికి పాల్పడ్డారు. అతని వాహనాన్ని దొంగలించే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో దుండగులు గుర్విందర్ నాథ్ ను తీవ్రంగా కొట్టారు. దీంతో అతని తల,శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూలై 14న మరణించడాడు.

అసలు విషయం ఏంటంటే...గుర్విందర్ నాథ్ కెనడాలోని ఓ బిజినెస్ స్కూల్లో చివరి సెమిస్టర్ విద్యార్థి. బ్రాంప్టన్ ఏరియాలో నివసిస్తున్నాడు. అతనికి కాలేజీకి సెలవులు అవ్వడంతో పిజ్జా డెలివరీలో పనిచేస్తున్నాడు. జూలై 9న తెల్లవారుజామున పిజ్జా డెలివరీ చేసేందుకు గుర్విందర్ కారులో వెళ్లాడు. కొందరు దుండగులు ఆయన కారును దొంగలించే ప్రయత్నం చేశారు. దీంతో గుర్విందర్ నిరసన తెలపడంతో అతనిపై దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో గుర్విందర్ తీవ్రంగా గాయపడ్డాడు.

గుర్విందర్ తలకు తీవ్ర గాయలవ్వడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ట్రామా సెంటర్ లో చికిత్స పొందడంతో...పరిస్థితి విషమించింది. జూలై 14న మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..కుట్రపూరితంగానే ఈ దాడి జరిగినట్లు తెలిపారు.

భారతీయ యువకుడు మరణం పట్ల కెనడాలోని భారత కాన్సుల్ జనరల్ సిద్ధార్థనాథ్ తీవ్రసంతాపం వ్యక్తం చేవారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత సంతతికి చెందిన వ్యక్తులు బాధిత కుటుంబానికి అండగా నిలించేందుకు హస్తం అందించిన తీరు చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు సిద్ధార్థనాథ్. ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ తీర్చలేరు. అయితే బాధిత కుటుంబాన్ని తప్పకుంటా అన్ని విధాల ఆదుకుంటామన్నారు. కెనడాలోని హైకమిషన్ సహాయంతో గుర్విందర్ మృతదేహం జూలై 27న భారత్ కు తీసుకురానున్నారు.

#international-news #canada #indian-student-killed-in-canada #gurvinder-nath #mississauga #pizza-delivery
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe