కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. యువకుడి ఇంటిపై తల్లిదండ్రుల దాడి

ప్రకాశం జిల్లాలో దర్శి మండలం బొట్లపాలెంకి చెందిన ఓ యువకుడు.. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ కూతురు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ యువకుడి కుటుంబ సభ్యులకు దాడికి పాల్పడ్డారు. తల్లిని కొట్టి, ఆ తర్వాత సోదరి బట్టలు చింపి అమానుషంగా పెట్రోల్ పోసి.. చంపేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై యువకుడి బంధువులు, స్థానికులు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులు బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

New Update
Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!

తమ కూమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని.. దళిత కుటుంబపై దారుణంగా దాడికి పాల్పడ్డారు యువతి తల్లిదండ్రులు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. దర్శి మండలం బొట్లపాలెంకి చెందిన ఓ యువకుడు.. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ కూతురు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ యువకుడి కుటుంబ సభ్యులకు దాడికి పాల్పడ్డారు. యువకుడి తల్లి, సోదరిపై దారుణంగా దాడి చేశారు. యువకుడి తల్లిని కొట్టి, ఆ తర్వాత సోదరి బట్టలు చింపి అమానుషంగా పెట్రోల్ పోసి.. చంపేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై యువకుడి బంధువులు, స్థానికులు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో యువకుడి తల్లి అనురాధ, సోదరి మౌనిక చికిత్స పొందుతున్నారు. మరోవైపు అనురాధ, మౌనికలపై దాడి చేసిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు