Attack on CM Jagan: జగన్ పై దాడి కేసు.. దుర్గారావు ఎక్కడ? జగన్ పై దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గారావు ఎక్కడని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో A1గా ఉన్న సతీష్ అరెస్ట్ చూపిన పోలీసులు దుర్గారావును ఎందుకు చూపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Nikhil 19 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో A1 గా ఉన్న సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సతీష్ కు కోర్టు రిమాండ్ కూడా విధించింది. అయితే.. ఈ కేసులో A2గా దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ మాత్రం చూపడం లేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 16న దుర్గారావును పోలీసులు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి దుర్గారావు ఆచూకీ లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దుర్గారావును ఏం చేశారని తల్లి, భార్య ప్రశ్నిస్తున్నారు. దుర్గారావు ఎక్కడున్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. దుర్గారావు మా దగ్గరే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దుర్గారావును ఎందుకు చూపించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే.. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నాని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు కదలికలు ఉన్నట్లు నిర్ధారించాయన్నారు. మాకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. 17న నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి మొబైల్ ఫోన్ సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడు కేసులో A2 ప్రోద్బలంతో దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు పదునైన రాయితో దాడి చేశాడని వెల్లడించారు. దాడి వెనుక సీఎం ను చంపాలన్న ఆలోచన ఉందన్నారు. ఈ నేపథ్యంలో అదను చూసి సీఎం జగన్ సున్నితమైన తల భాగంలో దాడి చేశాడన్నారు. దాడి జరిగిన రోజు రాత్రి 8:04 గంటల సమయంలో ప్రజలతో కలిసి బస్సు యాత్రలో నిందితుడు ఉన్నాడన్నారు. దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయి తీసుకొని వచ్చాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి