Nagar Kurnool district: నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో దారుణం.. పిల్లలను చంపిన తల్లి

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పిల్లల ప్రాణాలు తీసింది. బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూరుకు చెందిన లలిత తన భర్త శరబందతో గొడవ పడింది. అనంతరం భర్తపై కోపంతో రగిలిపోయిన లలిత తన నలుగురు పిల్లలు మహాలక్ష్మి(5), చరిత(4), మంజూల(3), 7 నెలల చిన్నారి మార్కెండేయను సమీపంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వలోకి తోసేసింది.

Nagar Kurnool district: నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో దారుణం.. పిల్లలను చంపిన తల్లి
New Update

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పిల్లల ప్రాణాలు తీసింది. బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూరుకు చెందిన లలిత తన భర్త శరబందతో గొడవ పడింది. అనంతరం భర్తపై కోపంతో రగిలిపోయిన లలిత తన నలుగురు పిల్లలు మహాలక్ష్మి(5), చరిత(4), మంజూల(3), 7 నెలల చిన్నారి మార్కెండేయను సమీపంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వలోకి తోసేసింది. పిల్లల్ని కెనాల్‌లో పడేయటాన్ని గమనించిన స్థానికులు కాల్వలోకి దూకి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులు ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీయగా చిన్నారి మార్కండేయ ఆచూకీ లభించలేదు.

మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గల్లంతైన చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు పిల్లల్లో ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరగుతుండేదని పోలీసులు తెలిపారు. లలిత భర్త శరబంద మద్యం సేవించి వచ్చి అమ్మాయిల విషయంలో భార్యతో గొడవపడేవాడని, ఇవాళ కూడా మద్యం సేవించి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడని పోలీసులు వెల్లడించారు.

దీంతో భర్త తరుచూ గొడవ పడుతుండటంతో ఆవేశంతో పిల్లలను ఇంటినుంచి తీసుకెళ్లిన లలితా.. కేఎల్‌ఐ కాల్వలో వారిని తొసేసినట్లు వెల్లడించారు. దీంతో పిల్లలను కాల్వలోకి తోసేసిన లలితను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా భార్యాభర్తల మధ్య వివాదంలో ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని, దంపతుల వివాదంలో పిల్లలను తీసుకురావద్దని పోలీసులు సూచించారు. మరోవైపు లలిత భర్త గురించి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

#nagar-kurnool-district #bijinepally #manganur #lalita #sharabanda #adras
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe