Khammam: యువతి ప్రాణం తీసిన పెద్దల కుల పంచాయితీ..!

భద్రాద్రి జిల్లా పెద్దగొల్లగూడెంలో పెద్దల కుల పంచాయితీ యువతి ప్రాణం తీసింది. చైతన్య, మానస ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల మరో యువతితో చైతన్యకు ఎంగేజ్మెంట్‌ జరిగింది. చైతన్య వివాహానికి అడ్డురావొద్దని కులపెద్దలు వార్నింగ్ ఇచ్చారు. మనస్తాపం చెందిన మానస ఆత్మహత్యకు పాల్పడింది.

New Update
Khammam: యువతి ప్రాణం తీసిన పెద్దల కుల పంచాయితీ..!

Also Read: ఆ జిల్లాలో 500 ఏళ్ల క్రితం నాటి వింత ఆచారం.. అర్థరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి ఏం చేస్తారంటే..?

మనస్తాపంతో..

దీంతో చైతన్య వివాహానికి అడ్డురావొద్దని ఇటీవల మాన‌సను పంచాయితీకి పిలిపించిన కుల పెద్దలు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ప్రేమ వ్యవహారం పదిమందికి తెలియడంతో మానస మనస్తాపం చెందింది. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు యువతి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Also Read: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మానస మృతి చెందింది. కుల పంచాయితీ విషయం బయటికి రావడంతో మానస తల్లి, తమ్ముడికి కులపెద్దలు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. లేదంటే ఊరి నుంచి బహిష్కరిస్తామంటూ మానస కుటుంబాన్ని హెచ్చరించినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు