Atchannaidu: "జగన్ నాలుగేళ్ల 7 నెలల పాలనలో జరిగింది ఇదే"

వైసీపీ నుంచి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోందన్నారు టీడీపీ నేత అచ్చెనాయుడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. జగన్ నాలుగేళ్ల 7 నెలల పాలనలో అన్యాయం, అరాచకం, దోపిడీలు, దుర్మార్గాలే తప్ప..ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని మండిపడ్డారు.

New Update
Atchannaidu: "జగన్ నాలుగేళ్ల 7 నెలల పాలనలో జరిగింది ఇదే"

Atchannaidu: టీడీపీలోకి అధికార పార్టీ వైసీపీ నుండి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, తంబళ్లపల్లికి చెందిన పారిశ్రామిక వేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన రాయపురెడ్డి సూరిబాబు, మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన రాఘవేంద్రరెడ్డి.

Also Read: ‘మోదీని గద్దె దించాలి, జగన్ ను ఇంటికి పంపించాలి’.!

ఈ కార్యక్రమం సందర్భంగా ఏపీ‌ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధల్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ఎన్నో ప్రభుత్వాల్ని చూసి ఉంటాం..కానీ,  భారత దేశ చరిత్రలో ఇంతటి దుర్మార్గమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని విమర్శలు గుప్పించారు. అయితే, ఇలాంటి ముఖ్యమంత్రిని ఇకపై చూడబోమని తేల్చి చెప్పారు. భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలు వైసీపీకి-టీడీపీకి మధ్యనో, వైసీపీకి-జనసేన మధ్యో జరుగుతున్నవి కావని..5 కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగు తున్న ఎన్నికలనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నాలుగేళ్ల 7 నెలల పాలనలో అన్యాయం, అరాచకం, దోపిడీలు, దుర్మార్గా లే తప్ప కనీసం ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించాడని ఫైర్ అయ్యారు. అందుకే జగన్ ను అభిమానించేవారు కూడా రాష్ట్రానికి పట్టిన శని ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్నారన్నారు. రేపు జనసేన-టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని.. రెండు పార్టీలను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేయాలని కోరారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. జైళ్లకు పంపినా.. వేధించినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆస్తులు, ప్రాణాలు కోల్పోయినా లెక్కచేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకోసం 4 ఏళ్ల 7 నెలలపాటు కష్టాలు కన్నీళ్లు భరించి పనిచేశారన్నారు. ఇప్పడు జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని.. మరో 100 రోజులు అందరం కష్టపడితే మన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యనించారు. ఈ క్రమంలోనే రోజురోజుకీ వైసీపీ నుంచి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. నేడు 6 నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి వైసీపీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం అని ధీమ వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలకు తీరని అన్యాయం చేశాడని దూషించారు.

Advertisment
తాజా కథనాలు