Mali: దారుణం..దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి! ఫ్రికా దేశమైన మాలిలో దేశ సరిహద్దుల్లోని డెంబో గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న ప్రజలపై కొందరు దుండగులు ఒక్కసారిగా దాడి చేసి 26 మందిని చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గమూ బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు. By Bhavana 23 Jul 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Mali: ఆఫ్రికా దేశమైన మాలిలో దేశ సరిహద్దుల్లోని డెంబో గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న ప్రజలపై కొందరు దుండగులు ఒక్కసారిగా దాడి చేసి 26 మందిని చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గమూ బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఇలాంటి దాడులు బాగా ఎక్కువ అయ్యాయని అధికారులు వివరించారు. అయితే, సైన్యం సైతం ఇలాంటి దాడులను నిలువరించలేకపోతోందన్నారు. సాధారణంగా ఇక్కడి గ్రామీణ ప్రజలపై ఉగ్ర సంస్థ అల్ ఖైదాకు అనుబంధంగా పని చేసే జేఎన్‌ఐఎం గ్రూప్ దాడి చేస్తుంది.. ఈ నెలలోనే ఓ వివాహ వేడుకలో కూడా కొందరు ఉగ్రవాదులు దాడులు చేసి 21 మంది సామాన్య ప్రజలను పొట్టన బెట్టుకున్నారని అధికారులు చెప్పుకొచ్చారు. తాజా దాడి కూడా వారి పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మధ్య, ఉత్తర మాలిలో దాదాపు దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఉత్తర ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద ముఠాలను ఫ్రెంచ్ సైన్యం సహాయంతో దేశ భద్రతా బలగాలు తరిమికొట్టాయి. వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి గ్రామాలు, సైనికులపై తరచూ దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ముఠాను అంతం చేసేందుకు సైనికులు కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. Also read: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం #africa #shoot #mali #26-dead మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి