Bhadradri : ఎస్సై ఆత్మహత్యాయత్నం! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30 (ఆదివారం) నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 01 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి SI Sriramulu Committed Suicide Attempt : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వారావు పేట మండలం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30 (ఆదివారం) నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి పడిపోయి ఉన్న శ్రీనివాస్‌ను అక్కడ స్థానికులు గుర్తించారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనును ముందుగా చికిత్స కోసం పోలీసులు మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి (Mahabubabad Government Hospital) తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎస్ ఐ శ్రీను ఆచూకీ కోసం పోలీస్ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా ఎస్సై శ్రీను, స్టేషన్ సిబ్బంది మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఒకరిపై ఒకరు ఎస్పీకి ఫిర్యాదు చేసుకున్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్లుగా సిబ్బంది ప్రచారం చేస్తున్నారని ఎస్సై సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడినట్లుగా సమాచారం సోమవారం నుంచి కొత్త చట్టాలు రాబోతున్నాయ్.. ప్రతి ఒక్కరూ సక్రమంగా పని చేయాలని ఆదివారం స్టేషన్ లో సిబ్బందికి సూచించారు. ఆ తరువాత ఆయన సొంత వెహికల్లో ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. మండలంలోని వినాయకపురం వరకు సెల్ ఫోన్ పని చేసింది. ఆ తరువాత పని చేయకపోవడంతో సిబ్బంది ఎస్సై కోసం వెదికారు. దీంతో ఆ విషయం జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల జరిగిన క్రైం రివ్యూ మీటింగ్ (Crime Review Meeting) లో ఉన్నతాధికారులు ఎస్సైని మందలించినట్లు సమాచారం. Also read: హరికేన్ బెరిల్ ఎఫెక్ట్…బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీమిండియా! #bhadradri-kothagudem #si #suicide-attempt #aswarao-pet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి