Astrology: మీ ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉందా..? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!

వాస్తు ప్రకారం, ఇంటి అలంకరణలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇంట్లో బుద్ధుని విగ్రహం తప్పు స్థలంలో ప్రతిష్టించడం జీవితకాల సమస్యలకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం బుద్ధుని విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

Astrology: మీ ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉందా..? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!
New Update

Astrology: ఇంటి అలంకరణ కోసం చాలా మంది ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ఉంచుతారు. వాస్తు ప్రకారం, ఈ విగ్రహం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. ఇంట్లో ప్రతికూలత నుంచి బయటపడతారు. అలాగే జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని తప్పు స్థలంలో ప్రతిష్టించడం జీవితంలో సమస్యలకు దారి తీస్తుంది. ఇంటి శ్రేయస్సు కోసం బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించడంలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము..

ఇంట్లో బుద్ధ విగ్రహాన్ని ఎలా ఉంచాలి

  • ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆశీర్వాద భంగిమలో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  • పొరపాటున కూడా బుద్ధుని విగ్రహాన్ని నేలపై ఉంచవద్దు. ఎల్లప్పుడూ నేల నుంచి 3-4 అడుగుల ఎత్తులో ఉంచండి. దీంతో శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని, జీవితంలో సంతోషం కలుగుతుందని చెబుతారు.
  • బుద్ధ భగవానుని విగ్రహాన్ని ఇంటికి పశ్చిమ దిశలో కుడివైపుకి వంచి.. ఉంచడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో ఆనందం, శాంతిని కాపాడుతుందని నమ్ముతారు.

publive-image

  • వాస్తు ప్రకారం, ఇంటి ఆలయంలో తూర్పు ముఖంగా బుద్ధుని విగ్రహాన్ని ఉంచండి. దీంతో శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
  • పిల్లల స్టడీ రూమ్ లో తూర్పు ముఖంగా బుద్ధుని విగ్రహాన్ని ఉంచాలి. దీంతో పిల్లల్లో ఏకాగ్రత పెరిగి చదువుపై ఆసక్తి పెరుగుతుందని నమ్మకం.
  • వాస్తు ప్రకారం, చేతులు జోడించి ఉన్న బుద్ధుని విగ్రహాన్ని డైనింగ్ హాల్ లేదా లివింగ్ రూమ్‌లో ఉంచాలి. ప్రార్థన చేసేటప్పుడు బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Also Read: Fashion: వేసవిలో కంఫర్ట్ తో పాటు స్టైలిష్ గా కనిపించాలా..? ఈ 5 రకాల డ్రెసెస్ బెస్ట్ ఆప్షన్..!

#astrology #vastu-tips #buddha-statue
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe