Astrology: తలపై బల్లి పడితే అశుభమా? ఇందులో నిజమెంత? గ్రంధాలలో.. బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే ఇంట్లో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సూచకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తలపై బల్లి పడితే అది చాలా శుభప్రదంగా చెబుతున్నారు. అంటే గౌరవం, విలువ పెరుగుతాయని పండితులు అంటున్నారు. By Vijaya Nimma 24 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Astrology: తలపై బల్లి పడితే దాని అర్థం ఏమిటో ఇళ్లలో తరచుగా చూస్తారు. బల్లులు ఎక్కువగా ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. గోడ మీద ఉన్న చిన్న చిన్న పురుగులు తింటూ బతుకుతూ ఉంటాయి బల్లులు. బల్లి విషపురుగు కొందరు చెబుతూ ఉంటారు. బల్లి పడిన ఆహారం తీసుకుంటే అది విషాహారంగా అంటారు. అయితే జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బల్లి మీద పడితే కొన్ని దోషాలకి సంకేతమని నిపుణులు చెబుతుంటారు. అయితే వాటిల్లో ఒకటి తలపై బల్లి పడితే ఎలాంటి అశుభాలు ఉంటాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. బల్లి పడితే శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తలపై బల్లి పడితే అది చాలా శుభప్రదంగా చెబుతున్నారు. అంటే గౌరవం, విలువ పెరుగుతాయి. గ్రంధాలలో.. బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే ఇంట్లో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సూచకం. స్త్రీ తలపై ఎడమవైపు బల్లి పడితే అది శుభ సూచకం. మీ పదవిలో పెరుగుదల ఉంటుంది. మనిషి కుడి వైపున బల్లి పడితే అది అదృష్టంగా భావిస్తారు. ఒకరి తలపై బల్లి పడితే.. ఆ వ్యక్తి ఐశ్వర్యం, కీర్తితో నిండిన జీవితాన్ని గడుపుతాడని అర్థం. అదే సమయంలో.. బల్లి ఎప్పుడైనా నేలపై పడితే.. అది అశుభంగా పరిగణించబడుతుంది. ఏదో అవాంఛనీయమైనది జరగబోతోందని అర్థం. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఒక రోజులో ఎన్ని కేలరీలు బర్న్ చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి! #lizard మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి