footwear: పాదరక్షలకు కూడా జోతిష్యం వర్తిస్తుందా?..ఈ పనులు అస్సలు చేయకండి

పాదరక్షణలకు కూడా జోతిష్యంలో కొన్ని నియమనిబంధనలు ఉంటాయిన పండితులు చెబుతున్నారు. చెప్పులకు శనితో సంబంధం ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. అందుకే శని ప్రభావం ఉన్నవారు చెప్పులను దానం ఇస్తే మంచిదని పెద్దలు చెబుతుంటారు. చెప్పులను దొంగిలించినవి వాడితే అదృష్టం కలిసిరాదు.

New Update
footwear: పాదరక్షలకు కూడా జోతిష్యం వర్తిస్తుందా?..ఈ పనులు అస్సలు చేయకండి

footwear: జ్యోతిష్యం అనేది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. ప్రతి అంశాన్ని వారాలు, వర్జాలు చూసుకోవడం పరిపాటిగా మారింది. ఏ పని చేయాలన్నా పండితుల సలహా తీసుకోనిదే మొదలుపెట్టడం లేదు. అయితే పాదరక్షణలకు కూడా జోతిష్యంలో కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. చెప్పులకు శనితో సంబంధం ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. అందుకే శని ప్రభావం ఉన్నవారు చెప్పులను దానం ఇస్తే మంచిదని పెద్దలు చెబుతుంటారు.

publive-image

జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. పూజ‌లు, శాంతి హోమాలు ఎన్ని చేసినా దురదృష్టం మాత్రం పోదు. ఇందుకు పాదరక్షలు కూడా కారణమని అంటున్నారు. ఎప్పుడూ రెండూ ఒకే సైజు ఉన్న చెప్పులు తీసుకోవాలి. దొంగతనం చేసిన, ఎవరైనా బహుమతిగా ఇచ్చిన చెప్పులను వేసుకోకూడదు. దొంగిలించినవి వాడితే అదృష్టం కలిసిరాదు. అంతేకాకుండా దురదృష్టం వెంటాడుతుంది. ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లేప్పుడు చిరిగిన, పాడైపోయిన చెప్పులు అస్సలు వేసుకోకూడదు. చిరిగినవి మన విజ‌యానికి అడ్డుగా నిలుస్తాయి. మీ ద‌గ్గర డబ్బుల్లేకపోతే ఎవరివన్నా అడిగి వేసుకోవచ్చు. కానీ దొంగతనం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు.

publive-image

కార్యాలయానికి వెళ్తే బ్రౌన్, వుడ్ క‌ల‌ర్ షూలను వేసుకోకూడదు. అవి మనకు ప్రతికూలంగా మారుతాయి. విద్యాసంస్థలు, బ్యాంకుల‌కు కాఫీ రంగు లేదా డార్క్ బ్రౌన్ క‌ల‌ర్ షూస్‌ను వేసుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇవి ఆదాయ మార్గాలను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. తెల్లని షూట్‌ వేసుకుంటే డబ్బు నిలవదని, వైద్య రంగంలో పనిచేసేవారు తెలుపు అస్సలు వేసుకోకూడదు. అలా వేసుకుంటే దురదృష్టం. ఆయుర్వేద రంగంలో ఉన్నవారు బ్లూ క‌ల‌ర్ షూ వేసుకోవద్దు. ఇంటికి ఈశాన్య మూల‌న షూ ర్యాక్ అస్సలు ఉంచవద్దు. ఉదయాన్నే సూర్యకిరణాలు పడితే పాజిటివ్‌ ఎనర్జీ పోతుందని నిపుణులు అంటున్నారు. ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపు మాత్రమే చెప్పులు వదలాలి. ఇంట్లో, బయట షూని వేలాడదీస్తే మృత్యువు తప్పదని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కొవ్వు పెరగడానికి కోడిగుడ్డు కూడా కారణమా..?.. నిపుణులు ఏమంటున్నారు..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు