Astro Tips: కొత్త సంవత్సరంలో మీ స్నేహితులకు ఈ బహుమతులు అస్సలు ఇవ్వొద్దు..!

కొత్త సంవత్సరంలో మీ స్నేహితులకు, భాగస్వాములకు కొన్ని రకాల బహుమతులు అస్సలు ఇవ్వొద్దు. చెప్పుడు, వాచెస్, కర్చీఫ్, కత్తెరలు ఇవ్వొద్దు. అలాగే విగ్రహాలు, మనీ ప్లాంట్స్ ఇవ్వొద్దు. అలా చేస్తే మీ బంధంలో ఘర్షణలు తలెత్తుతాయి. విండ్ చైమ్ గిఫ్ట్ గా ఇస్తే ఇద్దరికీ మేలు జరుగుతుంది.

Astro Tips: కొత్త సంవత్సరంలో మీ స్నేహితులకు ఈ బహుమతులు అస్సలు ఇవ్వొద్దు..!
New Update

New Year Astro Tips: మరికొద్ది రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. 2024 సమీపిస్తోంది. సాధారణంగా కొత్త సంవత్సరంలో వ్యక్తులు తమ స్నేహితులకు, తమ భాగస్వాములకు బహుమతులు ఇస్తుంటారు. అయితే, ఈ బహుమతులను జ్యోతిష్యం, వాస్తు ప్రకారం ఇస్తే మేలు జరుగుతుందని చెబుతున్నారు పండితులు. ఈ జ్యోతిష్య మార్గర్శకాలకు అనుగుణంగా గిఫ్ట్స్ ఇస్తే.. వాటిని ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. లక్ష్మీ దేవిని అసంతృప్తికి గురిచేయకుండా.. మీ సంబంధాలలో ఎడబాటు కలుగకుండా ఉండటానికి ఈ నియమాలను పాటించడం మేలు అని అంటున్నారు పండితులు. దైవిక శక్తికి భంగం కలిగించే బహుమతులు ఇవ్వడం మానుకోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.

స్నేహ బంధమైన.. మరే బాంధవ్యం అయినా.. ఇరువురిపై అవాంఛనీయ పరిణామాలు, ప్రభావాన్ని తొలగించడానికి ఆలోచనాత్మక బహుమతిని ఇవ్వడం చాలా కీలకం అని చెబుతున్నారు పండితులు. వాస్తు, జ్యోతిష్య నియమాలను అనుసరించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం అవుతుందంటున్నారు. కొత్త సంవత్సరంలో ఎవరికైనా బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే.. సానుకూల ఫలితాల కోసం ఈ మార్గదర్శకాలను పాటిస్తే మేలు జరుగుతుందంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. నూతన సంవత్సరంలో బూట్లు, చెప్పులు, కత్తులు, కత్తెరలు, గడియారాలు, కర్చీఫ్‌లు బహుమతిగా ఇవ్వకూడదు. ఇవి పేదరికానికి ప్రతీకగా పరిగణించబడతాయి. ప్రతికూల శక్తికి కారణం అవుతుంది. ఇది సంబంధాలలో సంభావ్య సమస్యలు, అపార్థాలకు దారి తీస్తుంది.


ఆర్థిక సంక్షోభాలను నివారించడానికి.. మనీ ప్లాంట్‌ను అభ్యర్థించడం, బహుమతిగా ఇవ్వడం సరికాదు. అదే విధంగా, నూతన సంవత్సరంలో దేవుని విగ్రహాన్ని సమర్పించడం వల్ల లక్ష్మీ దేవి అసంతృప్తికి గురవుతుందని వాస్తు శాస్త్రంలో హెచ్చరిస్తున్నారు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం వలన నూతన సంవత్సరంలో సానుకూల శక్తులు, దేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో లేదా కార్యాలయంలో విండ్ చైమ్‌ను అమర్చడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది సృష్టించే ఆహ్లాదకరమైన ధ్వని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. పేదరికాన్ని తొలగిస్తూ శ్రేయస్సును ఆహ్వానిస్తుంది.

Also Read:

వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి..

కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్‌.. రూల్స్‌ ఇవేనా?!

#astrology #new-year-astro-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe