Rashmika Madanna: తప్పేంముంది.. ఆమె కావాలని అడగలేదుగా! సాయి తన మేడం రష్మికను అంతగా గౌరవించాడు అంటే..ఆమె సాయిని ఆర్థికంగా ఆదుకొని ఉండవచ్చు..లేకపోతే ఇంకా ఏదైనా విధంగా సాయమైనా చేసి ఉండవచ్చు. అందుకే ఆమె కాళ్లకు మొక్కినట్లు కొందరు పేర్కొంటున్నారు. By Bhavana 04 Sep 2023 in సినిమా New Update షేర్ చేయండి ఏంటో ఈ మధ్య సెలబ్రిట్రీలు ఎవరి కాళ్లైనా మొక్కినా, లేకపోతే వారికి ఎవరైనా మొక్కినా పెద్ద సంచలనం అయిపోతుంది. కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi aditya nath) కాళ్లకు నమస్కారం పెట్టారు. అది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే యోగి రజినీ కాంత్ కంటే చిన్నవాడు. అందుకే ఆయన కాళ్లు మొక్కడంతో పెద్ద రచ్చకు తెరలేపింది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక విషయంలో అదే జరుగుతుంది. రష్మిక మేకప్ అసిస్టెంట్ సాయి వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రష్మిక హాజరయ్యింది. Your browser does not support the video tag. ఆమెను చూడగానే సాయి తన భార్యతో కలిసి రష్మిక (Rashmika) కాళ్లకి మొక్కాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి కానీ రష్మిక కాళ్లకు కొత్త దంపతులు మొక్కడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎంత అసిస్టెంట్ అయినప్పటికీ పెళ్లి కానీ అమ్మాయికి మొక్కకూడదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా..సాయి తన మేడం రష్మికను అంతగా గౌరవించాడు అంటే..ఆమె సాయిని ఆర్థికంగా ఆదుకొని ఉండవచ్చు..లేకపోతే ఇంకా ఏదైనా విధంగా సాయమైనా చేసి ఉండవచ్చు. అందుకే ఆమె కాళ్లకు మొక్కినట్లు కొందరు పేర్కొంటున్నారు. రష్మిక కావాలని కాళ్ళు మొక్కించుకోలేదు. ఈ విషయంలో రష్మికను తప్పుపట్టాల్సింది లేదని... పలువురు నెటిజన్లు అంటున్నారు. #rashmika #assistant-marriege మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి