మరో రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్ పై చర్చ!!

ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించినట్లు సమాచారం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడం మరో వైపు ఆర్టీసీ బిల్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ సమావేశాల వ్యవధిని పెంచాల్సి వచ్చింది. దీంతో శాసనసభాపర్వం  ఆగష్టు 7,8 తేదీల్లో కూడా కొనసాగనుంది.

మరో రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్ పై చర్చ!!
New Update

ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించినట్లు సమాచారం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడం మరో వైపు ఆర్టీసీ బిల్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ సమావేశాల వ్యవధిని పెంచాల్సి వచ్చింది. దీంతో శాసనసభాపర్వం  ఆగష్టు 7,8 తేదీల్లో కూడా కొనసాగనుంది.

ఇప్పటికే గవర్నర్ తమిళి  సై ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లును ఆమోదించడంతో ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ చేయడానికి మార్గం సుగమమైంది. దీంతో డ్రాఫ్ట్ బిల్లును ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టి, చర్చలు జరిపి, ఆమోదం పొందేందుకు తగినంత సమయం కావాలి.. కాబట్టి మంగళవారం వరకు సభను నడపాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అయితే ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లును ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి ఈ నెల 2 వ తేదీన పంపింది. ఆ తరువాతి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక వెంటనే బిల్లును ప్రవేశ పెట్టి చర్చించి ఆమోదం పొందవచ్చని ప్రభుత్వం భావించినా అది సాధ్యపడలేదు. పరిశీలన తరువాత సందేహాల నివృత్తికే గవర్నర్ తమిళి సై నాలుగు రోజులు తీసుకున్నారు. ఉత్కంఠ పరిణామాల మధ్య ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దీంతో అసెంబ్లీ సెషన్ ను రెండు రోజుల పొడిగించాల్సి వచ్చింది. ఇక అప్పటికీ పూర్తికాకపోతే మరికొంత సమయం కూడా పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి