Currency Notes : ఏందిరా ఇది..కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత..వైరల్ ఫొటో.!

అస్సాంకు చెందిన రాజకీయనేత బెంజమిన్ బాసుమతరీ కరెన్నీ నోట్లపై నిద్రిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచంమీద ఐదువందల నోట్లు చెల్లాచెదురుగా వేసి వాటి మధ్య పడుకున్నాడు. ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Currency Notes : ఏందిరా ఇది..కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత..వైరల్ ఫొటో.!
New Update

Currency Notes : రాజకీయ నాయకుల ఇళ్లలో కానీ, అవినీతికి పాల్పడినవారి ఇళ్లలో కానీ ఏసీబీ, సీబీఐ, ఈడీలు దాడి చేసినప్పుడు..కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. బీరువాలో, ట్రంక్ పెట్టెలో, మంచంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ అవినీతి సొమ్మును దాస్తుంటారు. ఇంకొందరు తెలివిగా బ్యాంక్ లాకర్ లో లేదా బంధువుల ఇళ్లలో దాచిపెడుతుంటారు. ఇలా ఎంతో మంది నాయకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇలా అక్రమ సొమ్ముతో దొరికిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోను చూస్తే మీరు షాక్ అవ్వడం పక్కా.

అస్సాంకు చెందిన ఓ రాజకీయ నేత మంచంపై ఐదువందల రూపాయల నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అస్సాంలోని ఉదల్ గిరి జిల్లాలోని భైరగురిలో విలేజ్ కౌన్సిల్ డెవల్ మెంట్ కమిటీ ఛైర్మన్ బెంజమిన్ బసుమతరీ 5వందల నోట్లు మంచంపై పరుచుకుని నిద్రిస్తున్నాడు. అంతేకాదు అతనిపై కొన్ని నోట్ల కట్టలను వేసుకున్నాడు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ..యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ప్రెసిడెంట్ ప్రమోద్ బోరో, జనవరి 10, 2024న పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు... బాసుమత్రికి ఇకపై పార్టీతో సంబంధం లేదని తెలిపారు.

publive-image

జనవరి 5, 2024న హరిసింగ బ్లాక్ కమిటీ,యూపీపీఎల్ నుండి ఒక లేఖ అందుకున్న తర్వాత అతనిపై క్రమశిక్షణా చర్య తీసుకున్నట్లు బోరో వెల్లడించారు. డోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (BTC) ఫిబ్రవరి 10, 2024న VCDC ఛైర్మన్ పదవి నుండి బాసుమతరీని సస్పెండ్ చేసి తొలగించిందని ఆయన తెలిపారు.కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఐదేళ్ల క్రితం వారింట్లో పార్టీ చేసుకున్నప్పుడు బాసుమతరీ స్నేహితులు తీసిన ఫోటో అని స్ఫష్టం చేశారు. కాగా బాసుమతరీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

publive-image

ఇది కూడా చదవండి: ముంబై Vs హైదరాబాద్.. మరికొద్ది సేపట్లో సమరం!

#500-currency-notes #sleeping-on-currency-notes #paramlaboratory #bhairaguri #udalguri #benjamin-basumatary
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe