అదంతా మీడియా ప్రచారం...రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం సీరియస్..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సీరియస్ అయ్యారు. రాహుల్ పర్యటన గురించి మీడియా ప్రచారం చేస్తుందంటూ కొట్టిపారేశారు. మణిపూర్ అల్లర్ల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించవద్దని హెచ్చరించారు. మణిపూర్ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తాయని..రాహుల్ వంటి నాయకుల వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు ఉండవన్నారు.

New Update
అదంతా మీడియా ప్రచారం...రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం సీరియస్..!!

ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ లో గత కొన్నాళ్లుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకుడి కంటే కరుణ అవసమన్నారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. జాతికలహాలతో అడ్డుకుడుకుతున్న రాష్ట్రంలో రాహుల్ పర్యటన గురించి ప్రస్తావించారు. ఇదంతా కేవలం మీడియా ప్రచారం మాత్రమే అంటూ కొట్టిపారేశారు. మణిపూర్ పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తున్నాయన్న హిమంత బిశ్వ శర్మ...రాహుల్ వంటి నాయకుల పర్యటన వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు ఉండవన్నారు.

RAHUL VISIT MANIPUR

రాహుల్ ఒక్కరోజు మాత్రమే పర్యటిస్తున్నారు. అదంతా మీడియా ప్రచారం తప్పా మరొకటి కాదు. ఈ పర్యటనకు సంబంధించి సానుకూల ఫలితాలు వస్తే పరిస్థితి ఇంకోవిధంగా ఉండేది. కానీ ఇలాంటి పర్యటనల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవన్నారు.

మణిపూర్ ఇప్పుడు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుందని..దీనిని రాజకీయం చేసేందుకు ఎవరూ ప్రయత్నించవద్దన్నారు. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు అసోం సీఎం. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులు సానుభూతితో విభేదాలను పరిష్కరించుకోవాలన్నారు. ఒక రాజకీయ నాయకుడు తన పర్యటనను తప్పుదోవ పట్టించేందుకు ఉపయోగించుకోకూడదని..దేశ ప్రయోజనాలకు మంచిది కాన్నారు. ఇలాంటి ప్రయత్నాలను రాష్ట్రంలోని రెండు వర్గాలు తిరస్కరించాయన్నారు.

బీజేపీ కార్యాలయంపై మూకుమ్మడి దాడి:
మరోవైపు ఇంఫాల్‌లో గురువారం అర్థరాత్రి, బీజేపీ కార్యాలయంపై అల్లమూకలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డాయి. అల్లమూకలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించవలసి వచ్చింది. దీంతో ఆగ్రహించిన అల్లమూకలు రోడ్డుపై నిప్పంటించారు. పోలీసులకు, అల్లరిమూకలకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అంతకుముందు, మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో గురువారం కవ్వింపు చర్యలకు పాల్పడటంతో సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన 125 మందికి:
ఇటీవల మణిపూర్‌లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లారు. మే 3 నుంచి కుల హింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రానికి కాంగ్రెస్‌ నేత రావడం ఇదే తొలిసారి. మణిపూర్‌లో మెయిటీ కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చే అంశంపై కుకీ, మైతేయి కమ్యూనిటీల మధ్య హింస కొనసాగుతోంది, ఇందులో ఇప్పటివరకు 125 మందికి పైగా మరణించారు. హింస దృష్ట్యా, రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను నిషేధించారు. రాష్ట్రంలో 36 వేల మంది భద్రతా సిబ్బంది, 40 మంది ఐపీఎస్‌లను నియమించారు. ఇంత జరుగుతున్నా మణిపూర్‌లో హింస మాత్రం ఆగడం లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు