ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అస్పర్టేమ్ అనేది అత్యంత ప్రమాదకరమైందని వెల్లడించింది. ఈ కృత్రిమ స్వీటెనర్ అతిగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పదని హెచ్చరించింది. WHO నివేదిక ప్రకారం, క్యాన్సర్ మాత్రమే కాకుండా కృత్రిమ స్వీటెనర్ అస్పర్టమ్ అనేక రకాలకు కారణం అవుతుందని వివరించింది. శీతల పానీయాలు, ఐస్ క్రీం, చూయింగ్ గమ్‌లలో అత్యధికంగా ఉపయోగిస్తారు. అస్పర్టమ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, క్యాన్సర్ కణాలు శరీరంలో వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. నివేదికల ప్రకారం, అస్పర్టమ్ ఒక క్యాన్సర్ కారకమని..ఇది క్యాన్సర్ కారకాలను ప్రరేపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
అస్పర్టమ్ ని షుగర్ ఫ్రీ అని కూడా అంటారు. ఇది ఒక కృత్రిమ స్వీటెనర్‌గా పనిచేస్తుందిప. ఆహార పదార్థాలలో తీపిని ఉత్పత్తి చేసే పెప్టైడ్ డైస్‌లోని మిథైల్ ఈస్టర్‌లను కలిగి ఉంటుంది. దీనిని 1980ల నుండి ఆహార పదార్థాలలో ఉపయోగిస్తున్నారు. ఇది చక్కెర కంటే 160 రెట్లు తియ్యగా ఉంటుంది.
IARC నివేదిక ఏం చెబుతోంది?
అస్పర్టేమ్‌ను తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని.. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) నివేదిక వెల్లడించింది. అస్పర్టమ్ కేవలం క్యాన్సర్ ముప్పు మాత్రమే కాదు.., ఇది తలనొప్పి, జీర్ణ సమస్యలు, అలెర్జీ ప్రతిచర్యల నుండి గుండె సమస్యల వరకు అనేక రకమైన వ్యాధులకు కారణం అవుతుంది. దీని వల్ల కలిగే ఇతర సమస్యల గురించి తెలుసుకుందాం.
తలనొప్పి,మైగ్రేన్:
అస్పర్టమ్ కలిగిన ఉత్పత్తులను తీసుకున్న తర్వాత తలనొప్పి లేదా మైగ్రేన్లు సంభవించవచ్చు. అయినప్పటికీ, అస్పర్టమ్ ను తలనొప్పికి అనుసంధానించే శాస్త్రీయ ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే చాలా మందిలో అస్పర్టమ్ ను వాడుతున్నప్పటికీ ఈ లక్షణాలు బయటకు కనిపించవని IARC పేర్కొంది.
అలర్జీలు:
కొంతమందికి అస్పర్టమ్ తీసుకోగానే అలెర్జీ వస్తుంది. దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర అలెర్జీ ప్రతిచర్యలు వంటి లక్షణాలు ఉంటాయి.
గుండె జబ్బులు:
కొన్ని అధ్యయనాల ప్రకారం...కృత్రిమ స్వీటెనర్ వినియోగం గుండె జబ్బులు, స్ట్రోక్ , అధిక BP వంటి కొన్ని హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
జీర్ణకోశ సమస్యలు:
కొన్ని సందర్భాల్లో, అస్పర్టమ్ అధిక వినియోగం వల్ల ఉబ్బరం, గ్యాస్, అతిసారం లేదా కడుపు నొప్పి వంటి జీర్ణశయాంతర లక్షణాలకు దారితీస్తుంది.
(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)