Asian Games 2023: కబడ్డీ ఫైనల్‌లో ధర్నా, డ్రామా.. గంటపాటు ఇండియా, ఇరాన్ ఆటగాళ్ల నిరసన! ఏషియన్ గేమ్స్‌లో భాగంగా ఇరాన్-ఇండియా మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్ మ్యాచ్ హైడ్రామాకు వేదికైంది. మ్యాచ్ మరో 65 సెకన్లలో ముగుస్తుందనగా.. ఇరు జట్ల ఆటగాళ్లు కబడ్డీ మ్యాట్‌పైనే ధర్నాకు దిగారు. పాయింట్ల విషయంలో ఇరు జట్ల ఆటగాళ్లు అంపైర్‌తో వాదించగా.. దాదాపు గంటన్నర మ్యాచ్ నిలిపివేత తర్వాత నిర్ణయం ఇండియాకు ఫేవర్‌గా వచ్చింది. తర్వాత ఓ టాకిల్, ఓ సక్సెస్‌ఫుల్ రైడ్‌తో ఇండియా 33-29తేడాతో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. By Trinath 07 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి క్షణక్షణం ఉత్కంఠ.. ఇరు జట్లు కబడ్డీ(Kabaddi)లో తోపులు.. పాయింట్ పాయింట్‌కి టెన్షన్ టెన్షన్. స్కోర్లు సమం అవుతూ సాగిన ఫైనల్.. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ ఇరాన్(India vs Iran) మ్యాచ్ సాగిన తీరు క్రీడా ప్రేమికులకు అసలు సిసలైన మజాను ఇచ్చింది. కబడ్డీ ఫీల్డ్‌పైనే ధర్నా చేసిన పరిస్థితి కనిపించింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్డ్‌లో నిరసన వ్యక్తం చేయడంతో గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. అంపైర్లు నిర్ణయంతో ఇండియా, ఇరాన్ ప్లేయర్లు ఆందోళనకు దిగారు. చివరికు ఫలితం ఇండియాకు అనుకూలంగానే వచ్చింది. తర్వాత ఒక టాకిల్, మరో రైడ్‌తో ఇండియా గెలిచింది. Epic choas! happening in asian games Kabaddi Final! Very poor refreeing#AsianGames #Kabaddi pic.twitter.com/ydDFTUka22 — Mudit Jain (@TheJainMudit) October 7, 2023 అసలేం జరిగింది? ఇరు జట్లు 28-28 స్కోర్‌తో సమానంగా ఉన్నాయి. మరో 65 సెకెండ్స్ మాత్రమే ఆటకు మిగిలి ఉంది. టీమిండియా కెప్టెన్ పవన్ రైడ్‌కి వెళ్లాడు. అతను ఎవర్ని టచ్ చేయకుండానే లాబీలోకి ఎంటర్ ఐపోయాడు. అటు ముగ్గురు ఇరాన్ డిఫెండర్లు సైతం లాబీలోకి వెళ్లిపోయారు. దీంతో ఇది వివాదంగా మారింది. పవన్‌ని అవుట్‌గా ప్రకటించాలని ఇరాన్ పట్టుపట్టింది. దీంతో ఇరాన్‌కి ఒక పాయింట్ ఇస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రివ్యూకు వెళ్లింది ఇండియా. ఇక రివ్యూ తర్వాత ఇండియాకు కూడా ఒక పాయింట్ ఇచ్చారు. దీనిపై భారత్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముగ్గురు ఆటగాళ్లు లాబీలోకి ఎంటర్ అయితే ఒక్క పాయింట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గేమ్ జరగనివ్వకుండా మ్యాట్‌పైనే నిరసనకు దిగారు. Team India in #Kabaddi at #AsianGames 1990 - Gold 🥇 1994 - Gold 🥇 1998 - Gold 🥇 2002 - Gold 🥇 2006 - Gold 🥇 2010 - Gold 🥇 2014 - Gold 🥇 2018 - Bronze 🥉 2022 - Gold 🥇 God-level CONSISTENCY.. 🔥🏆#AsianGames23 #IndiaAtAG22 pic.twitter.com/nRh2LqgYnZ — Ishan Joshi (@ishanjoshii) October 7, 2023 తర్వాత ఏం జరిగింది? నిజానికి పాత రూల్-కొత్త రూల్ మధ్య ఈ మ్యాచ్ నలిగిపోయిందనే చెప్పాలి. పాత రూల్ ప్రకారం పాయింట్లు ఇవ్వాలని పట్టుబట్టగా.. కొత్త రూల్ ప్రకారం ఇవ్వాలని చెప్పింది. అయితే కొత్త రూల్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అమలు చేయడంలేదని ఇండియా నిర్వాహకులు దృష్టకి తీసుకెళ్లింది. దీంతో దాదాపు గంటన్నర తర్వాత భారత్‌కు మూడు పాయింట్లు, ఇరాన్‌కు మరో పాయింట్ ఇచ్చారు. తర్వాత ఒక టాకిల్‌తో పాటు మరో రైడ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన ఇండియా 33-29తేడాతో గోల్డ్‌మెడల్ సాధించింది. నిజానికి అంతర్జాతీయ ఫెడరేషన్ రూల్ బుక్ ప్రకారం.. డిఫెండర్ లేదా డిఫెండర్లు ఎవరూ లాబీలోకి ఎంటరై రైడర్‌ని తాకకూడదు. ఇటు రైడర్ కూడా డిఫెండర్లను ఎవరినీ టచ్ చేయకుండా లాబీలోకి ఎంటర్ అయితే సెల్ఫ్ అవుట్‌గా ప్రకటిస్తారు. ALSO READ: వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు.. లంకేయులపై సఫారీల సెంచరీల సునామీ! #asian-games-2023 #kabaddi-final మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి