Asia Cup: సూపర్-4 వేదికల్లో మార్పుపై క్లారిటీ.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

ఆసియా కప్‌ మ్యాచ్‌ల వేదికలు మార్చకూడదని ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) నిర్ణయించుకుంది. సూపర్‌-4 మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ మ్యాచ్‌ కొలంబోలోనే జరుగుతుంది. కొలంబోలో వర్షాల కారణంగా మ్యాచ్‌లను హంబన్‌టోటాకు తరలించాలని ముందుగా అనుకున్నారు. అయితే కొలంబోలో వాతావరణ మెరుగయ్యే అవకాశాలు ఉండడంతో వేదిక మార్పు చేయడంలేదు. ఇక సెప్టెంబర్‌ 10న ఇండియా-పాకిస్థాన్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో తలపడనున్నాయి.

New Update
Asia Cup: సూపర్-4 వేదికల్లో మార్పుపై క్లారిటీ.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

Asia Cup 2023 India vs Pakistan : మ్యాచ్‌ అలా సజావుగా సాగడం వరుణ దేవుడికి అసలు ఇష్టం లేనట్టుంది. శ్రీలంక(Srilanka)లో జరుగుతున్న ఆసియాకప్‌(Asia cup) మ్యాచ్‌లు ఉత్కంఠగా జరుగుతున్నాయని ఇలా అనుకుంటామో లేదో.. ఈలోపే వరుణుడు ఎంట్రీ ఇస్తాడు. మ్యాచ్‌ని నిలిపివేస్తాడు. ఇంకా హాట్‌స్టార్‌(Hotstar), టీవీని పక్కన పెట్టి మళ్లీ క్రిక్‌బజ్‌(Cricbuzz) ఆన్‌ చేసి మ్యాచ్‌ ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఇండియా(India) వర్సెస్‌ పాకిస్థాన్‌(Pakistan) మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఇక నేపాల్‌తో మ్యాచ్‌లోనూ వరుణుడు చికాకు పెట్టాడు. మ్యాచ్‌ ఓవర్లను కుదించి ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలవడంతో సూపర్-4కి ఎంట్రీ ఇచ్చింది. ఇలా వరుస పెట్టి వానదేవుడు మ్యాచ్‌లకు అడ్డంకి మారుతుండడంతో వేదికలను మార్చాలని ముందుగా డిసైడ్ అయ్యారు.. అయితే తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.

వేదికల్లో మార్పు లేదు:
భారీ వర్షాల కారణంగా సూపర్‌-4తో ఫైనల్‌ మ్యాచ్‌ని కొలంబో(Colombo) నుంచి హంబన్‌టోటాకు షిఫ్ట్ చేస్తారని ముందుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే హంబన్‌టోటా చాలా మారుమూల జిల్లా.. ఒక మ్యాచ్‌కు తర్వాతి మ్యాచ్‌కి వ్యవధి తక్కువ ఉంటుంది. నిత్యం ఆసియా కప్‌ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఇలా ఉన్నట్టుండి వేదిక మారిస్తే.. అదికూడా హంబన్‌టోటాకు మారిస్తే మ్యాచ్‌లను టెలిక్యాస్ట్ ప్రసారదారుకు ఇబ్బంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) కొలంబోనే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో సూపర్‌ 4 మ్యాచ్‌లు, ఫైనల్‌ యధాతథంగా కొలంబోలోనే జరుగనున్నాయి. కొలంబోలో వాతావరణం మెరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో వేదికను మార్చకూడదని ఏసీసీ డిసిషన్‌ తీసుకుంది.

Also Read: ఇండియా పేరును భారత్‌ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం: సెహ్వాగ్‌!

సూపర్ 4 దశలో భారత్ షెడ్యూల్:

🏏 భారత్ వర్సెస్ పాకిస్థాన్. సెప్టెంబర్ 10, కొలంబో (03:00 PM IST)

🏏 భారత్ వర్సెస్ శ్రీలంక, సెప్టెంబర్ 12, కొలంబో (03:00 PM IST)

🏏 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, సెప్టెంబర్ 15, కొలంబో (03:00 PM IST)

సూపర్‌-4లో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ని దాయాది పాక్‌తో తలపడనుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 10న జరగనుంది. లీగ్‌ దశలో ఇప్పటికీ ఓ సారి తలపడ్డ ఇరు జట్ల మ్యాచ్‌ ఫలితం లేకుండా పోవడంతో అభిమానులు నిరాశ చెందారు. సూపర్-4 మ్యాచ్‌ పూర్తిస్థాయిలో జరగాలని కోరుకుంటున్నారు. సెప్టెంబర్‌ 2న ఇండియా-పాక్‌ తలపడగా టాప్‌-4 భారత్ బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. వరుసపెట్టి వికెట్లు పారేసుకున్నారు. అయితే నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్, రోహిత్‌ శర్మ మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న పాక్‌ పేసర్లు షాహీన్‌ ఆఫ్రిది, రౌఫ్‌ని ఆడడం అంత తేలిక కాదు.. కచ్చితంగా హోం వర్క్‌ చేసుకునే టీమిండియా బ్యాటర్లు బరిలోకి దిగాల్సి ఉంటుంది.

ALSO READ: వరల్డ్ కప్‌కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..స్టార్‌ కీపర్‌కు నో ఛాన్స్!

Advertisment
తాజా కథనాలు