ASIA CUP 2023: ఇండియా కోసం రూల్స్ మారుస్తారా? 'పళ్ళు లేని పులి'..! బీసీసీఐ, ఐసీసీ, ఏసీసీపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జుణ రణతుంగా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకముందు రిజర్వ్ డేన పాక్‌పై జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన గెలిచింది. దీని కారణంగా టీమిండియా ఖాతాలో అదనపు పాయింట్ పడిందని.. లేకపోతే బంగ్లాదేశ్ ఫైనల్‌కి వెళ్లేదేమోనని ఫైర్ అయ్యారు. రిజర్వ్ డే రూల్ కేవలం ఇండియా-పాక్ మ్యాచ్‌కి మాత్రమే పెట్టడంపై విమర్శలు ఆగడంలేదు. By Trinath 16 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ASIA CUP 2023: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్..! ఆట కంటే ఏదీ ఎక్కువ కాదు.. అది బోర్డు కావొచ్చు.. ఆటగాడు కావొచ్చు.. ప్రస్తుతం బీసీసీఐ విషయంలో పలువురు మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శ వ్యాఖ్యలు ఇవే. ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌కు రిజర్వ్ డే పెట్టడం వివాదాస్పదమైంది. మిగిలిన మ్యాచ్‌లకు పెట్టకుండా కేవలం ఇండియా-పాక్ మ్యాచ్‌కు మాత్రమే ఎందుకు రిజర్వ్ డే పెట్టారని విమర్శలు వచ్చాయి. విమర్శలకు తగ్గట్టుగానే మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వెళ్లింది. టీమిండియ పాకిస్థాన్‌పై గెలిచింది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి ఉంటే ఇండియా, పాక్ జట్టుకు తలో పాయింట్ వచ్చేది. నిన్న బంగ్లాదేశ్‌పై ఇండియా ఓడిపోయింది. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తు శ్రీలంక లెజెండ్ అర్జుణ రణతుంగా ఐసీసీపై ఫైర్ అయ్యారు. అర్జుణ రణతుంగా ఏం అన్నారంటే? శ్రీలంక 1996 ప్రపంచ కప్ విజేత కెప్టెన్, అర్జున రణతుంగా ఏసీసీ(ACC)ని విమర్శించిన తాజా ప్రముఖ క్రికెటర్. ఈ మాజీ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐసీసీ(ICC)ని కూడా విడిచిపెట్టలేదు.. క్రికెట్ పాలకమండలిని 'పళ్ళు లేని పులి' అని మండిపడ్డాడు. ఇది చాలా 'అన్ ప్రొఫెషనల్' అని ఫైర్ అయ్యారు. క్రికెట్ రూల్స్‌ని రక్షించాల్సిన వారే అతిక్రమిస్తున్నారని రణతుంగా ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అంతిమంగా క్రికెట్‌ను ఐసీసీ నియంత్రించాలని చెప్పారు. ఒక దేశ క్రికెట్ బోర్డు కోసం రూల్స్ మారుస్తారా అని విరుచుకుపడ్డారు. ఆసియా కప్‌లో కేవలం ఒక ఆట కోసం నియమాలను మార్చారని.. ఇలా జరుగుతుంటే ఏసీసీ ఎక్కడ ఉంది? ఐసీసీ ఎక్కడ ఉంది?’ అని రణతుంగ వ్యంగ్యంగా మాట్లాడారు. పరోక్షంగా బీసీసీఐకి చురకలంటించారు. ఒకటి లేదా రెండు జట్లకు సరిపోయేలా టోర్నమెంట్ నియమాలను మార్చడం ఆటను ప్రమాదంలో పడేస్తుందని రణతుంగా హెచ్చరించారు. ఐసీసీ(ICC), ఏసీసీ(ACC) నిబంధనలను కేవలం ఒక్క దేశం కోసం మార్చిందన్నారు. ఎందుకంటే బీసీసీఐ శక్తివంతమైనదని.. అందులోని ఒక వ్యక్తి శక్తివంతుండంటూ పరోక్షంగా బీసీసీఐ పెద్దలపై మండిపడ్డారు. కేవలం ఒక్క మ్యాచ్‌కు రిజర్వ్ డే పెట్టడమేంటని.. మిగిలిన ఆటలకు కూడా అదనపు రోజు ఇవ్వాల్సి ఉంటుందన్నారు రణతుంగా. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 14న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుందని.. భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇదే జరిగితే ఆశ్చర్యపోనక్కర్లేదని రణతుంగా అన్నారు. 1982-2000 మధ్యకాలంలో 93 టెస్టులు, 269 వన్డేల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన మాజీ కెప్టెన్, మాజీ క్రికెటర్లు మౌనంగా ఉన్నందుకు తీవ్రంగా విమర్శించారు. ALSO READ: రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది.! #asia-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి