Asia Cup 2023: ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్-పాక్ తలపడాలంటే.. ఏం జరగాలి..?

భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే మజానే వేరు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. దాయాది దేశాలు తలపడుతుంతే ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతారు. తమ దేశం గెలవాంటే తమ దేశం గెలవాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఓడిపోయిన జట్టు నిరాశలో మునిగిపోతే.. గెలిచిన జట్టు సంబరాల్లో తేలుతుంది.

New Update
Asia Cup 2023: ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్-పాక్ తలపడాలంటే.. ఏం జరగాలి..?

Asia Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే మజానే వేరు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. దాయాది దేశాలు తలపడుతుంతే ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతారు. తమ దేశం గెలవాంటే తమ దేశం గెలవాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఓడిపోయిన జట్టు నిరాశలో మునిగిపోతే.. గెలిచిన జట్టు సంబరాల్లో తేలుతుంది. ఐసీసీ టోర్నీల్లో తప్పితే ఇరు జట్లు మ్యాచులు ఆడటం లేదు. దీంతో దాయాదుల పోరుకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. 2019 ప్రపంచకప్‌లో తలపడిన ఇరు జట్లు.. ఇప్పుడు ఆసియాకప్‌లో కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు తలపడ్డాయి. మొదటి పోరు వర్షం కారణంగా రద్దు అయితే.. రెండో పోరులో భారత్ ఘన విజయం సాధించింది.

ఇప్పుడు మరోసారి భారత్-పాకిస్థాన్ జట్లు తలపడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఫైనల్‌ మ్యాచులో.. అలా జరగాలంటే పాకిస్తాన్.. గురువారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. ఈ మ్యాచ్‌లో లంకను ఓడిస్తేనే పాకిస్తాన్ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయినా లంక ఫైనల్ చేరుతుంది. మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అయితే రన్‌రేట్‌లో ముందున్న లంకేయులు భారతీయులతో తుది సమరానికి వెళ్తారు.

ప్రస్తుతం రెండు విజయాలతో రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండటమే కాకుండా ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక ప్రకారం భారత్.. 4 పాయింట్లతో +2.690 నెట్ రన్ రేట్‌తో తొలి స్థానంలో ఉంది. ఇక శ్రీలంక రెండు మ్యాచుల్లో ఒక విజయంతో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ -0.200గా ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకటి గెలిచి మరొక మ్యాచ్ ఓడిపోయింది. దీంతో అందులోనూ భారత్‌పై 228 పరుగులు భారీ తేడాతో ఓడిపోవడంతో రన్‌ రేట్ ఘోరంగా పడిపోయింది. ఆ జట్టు ఖాతాలో కూడా రెండు పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ మాత్రం -1.892గా ఉంది. ఇక సూపర్‌4 దశలో ఆడిన రెండు మ్యాచులు ఓడిన బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇది కూడా చదవండి: శ్రీలంకపై భారత్‌ గ్రాండ్‌ విక్టరీ.. చుట్టేసిన కుల్దీప్..!

Advertisment
తాజా కథనాలు