Ashtadigbandhanam Trailer: అష్టదిగ్బంధనం ట్రైలర్ రిలీజ్ చేసిన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్

New Update
Ashtadigbandhanam Trailer:  అష్టదిగ్బంధనం ట్రైలర్ రిలీజ్ చేసిన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్

Ashtadigbandhanam Trailer Released: 

సూర్య భరత్ చంద్ర (Surya Bharath Chandra), విషిక కోట (Vishika Kota) హీరో హీరోయిన్లుగా ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ (MKAKA Film Productions) పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం " అష్టదిగ్బంధనం " A game with crime " అనేది ట్యాగ్ లైన్ ".

సినిమాటోగ్రఫీ మినిస్టర్  శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ లాంచ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.
ఈ మూవీ ట్రైలర్ చూస్తే యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది, ఈ యుద్ధం రాజ్యం కోసమో, రాణి కోసమో, అధికారం కోసమో కాదు అహం కోసం అంటూ సాగిన నెరేషన్ డైలాగ్ ఇంట్రెస్ట్ రేకెత్తించింది. అహంతో మొదలైన యుద్ధం, ఆ అహం దేహాన్ని వీడినప్పుడే ముగుస్తుంది అని అంటూ ట్రైలర్ కట్ చేశారు. ఇక ట్రైలర్ లో అనేక హింసాత్మక సీన్స్ తో పాటు, కొన్ని రొమాంటిక్ షాట్స్ కూడా కనిపించాయి.

సినిమా మొత్తం అహంతో మొదలైన యుద్ధం, ఆ అహం దేహాన్ని వీడినప్పుడే ముగుస్తుంది అనే లైన్ మీదే సాగుతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది సినిమా యూనిట్.  మళయాలం బ్లాక్ బస్టర్ " ట్రాన్స్ " సినిమాకి సంగీతం అందించిన " జాక్సన్ విజయన్ " బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా ఉంది. సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Here To Watch Trailer

నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.
రచన - దర్శకత్వం: బాబా పి.ఆర్
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్
మ్యూజిక్: జాక్సన్ విజయన్ కెమెరా: బాబు కొల్లబత్తుల
ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల
ఫైట్స్: రామ్ క్రిషన్, శంకర్ ఉయ్యాల
లిరిక్స్: శ్యామ్ కాసర్ల, పూర్ణ చారి
ఆర్ట్: వెంకట్ ఆరే
పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి
ప్రొడక్షన్ మేనేజర్: కుర్మ భీమేష్
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన సావ్దేరక్
మేకప్: జి.శివ
కాస్ట్యూమర్: ప్రవీణ్
స్టిల్స్: శ్రీకాంత్.

Also Read: వైరల్ అవుతున్న అల్లు అర్జున్-షారూఖ్ ఖాన్ ఎక్స్(ట్విట్టర్) సంభాషణ

Advertisment
Advertisment
తాజా కథనాలు