Union Budget 2024: బడ్జెట్‌ కంటే అంబానీల పెండ్లి వీడియో చూడటం బెటర్.. అష్నీర్‌ గ్రోవర్‌ సెటైర్లు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కంటే అంబానీల పెండ్లి వీడియో చూడటం బెటర్‌ అంటూ ‘భారత్ పే’ సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ సెటైర్లు వేశాడు. బడ్జెట్‌ చూడటం పరమ బోరింగ్‌గా ఉంది. ఈసారి మనస్పూర్తిగా చూడలేకపోయామంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు.

New Update
Union Budget 2024: బడ్జెట్‌ కంటే అంబానీల పెండ్లి వీడియో చూడటం బెటర్.. అష్నీర్‌ గ్రోవర్‌ సెటైర్లు!

Ashneer Grover: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై ప్రముఖ వ్యాపారవేత్త, ‘భారత్ పే’ సహ వ్యవస్థాపకుడైన అష్నీర్‌ గ్రోవర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన లెక్కలు చూడటం కంటే అంబానీల పెండ్లి వీడియో చూడటం బెటర్‌ అంటూ సెటైర్ వేశాడు.

పరమ బోరింగ్‌గా ఉంది..
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన గ్రోవ్.. ‘బడ్జెట్‌ చూడటం పరమ బోరింగ్‌గా ఉంది. జీవం లేని అర్థం పర్థం లేని విధంగా అనిపిస్తోంది. మేం ఈసారి మనస్పూర్తిగా చూడలేకపోయాం. కానీ వచ్చేసారి ఇంకా బాగా చేస్తామని ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో వాళ్లు చెబితే బాగుండేది. అంబానీల పెండ్లి చూస్తే సమయాన్ని బాగా వినియోగించుకున్నవాళ్లం అవుతాం. ప్రజలు బడ్జెట్‌ను ఆశించేది ధరలు ఏమైనా తగ్గుతాయా? పెరుగుతాయా?, పన్నులు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? ఉద్యోగాలు, భవిష్యత్‌లో ఎలా ఖర్చు చేయాలనేదానిపైనే ఆలోచిస్తారని, కానీ తాజా బడ్జెట్‌లో అలాంటిదేమీ లేదు' అంటూ అంటూ విమర్శలు గుప్పించాడు.

Advertisment
తాజా కథనాలు