Tirupati: ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐటియుసి(AITUC) ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు హేమావతి అధ్యక్షత వహించారు. ఆశా కార్మికుల సమస్యలు తీరుస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చింది తప్ప.. అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్టు తెలిపారు యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్ శివ, యూనియన్ జిల్లా కార్యదర్శి చాముండేశ్వరి.
Also Read: ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఆందోళన
ఆశా కార్మికులకు డిఎంహెచ్వో సంతకం ఉన్న గుర్తింపు కార్డు ఇవ్వాలి అని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలి అని గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. అలానే రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని.. పింఛన్ సౌకర్యం 10 వేల రూపాయలు ఉండాలని ఆందోళన చేశారు. అర్హులైన ఆశా కార్మికులను ఎ. ఎమ్ ఎన్ ఓ లుగా ప్రమోషన్ ఇవ్వాలి నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ మణి, సిపిఐ మండల కార్యదర్శి మోహన్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కార్తీక్, ఆశ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వరి, ఆఫీస్ బేరర్స్ శశిరేఖ, ధనమ్మ, ఆశా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.